తెలంగాణ ఎన్నికలు : నేటినుంచే నామినేషన్ల పరిశీలన.. ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయంటే...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాయి. నేటి స్క్రూటినీలో ఎంతమంది నామినేషన్లు తిరస్కరించబడనున్నాయో తేలనుంది. 
 

Telangana Elections : Scrutiny of nominations from today - bsb

హైదరాబాద్ :  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ముగిసింది.  నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొదలవబోతోంది. నవంబర్ మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు  దాఖలైన నామినేషన్లని ఈరోజు స్క్రూటినీ చేయనున్నారు. ఈ నామినేషన్లను ఇవాళ ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. ఎన్నికల కోసం ఒక్కో అభ్యర్థి రెండు, మూడు నామినేషన్లు దాఖలు చేశారు. తాము ఆశించిన పార్టీ నుంచి వేసిన దరఖాస్తు కనక తిరస్కరించబడితే... స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగేందుకే ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో, మొత్తం రెండువేలకు పైగా దాఖలైన నామినేషన్ లలో ఎన్ని తిరస్కరణ గురవుతాయో ఈ ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది. ఆ తర్వాత 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.119 నియోజకవర్గాల్లో 2,327 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

బిజెపికి తుల ఉమా రాజీనామా.. నేడు బీఆర్ఎస్ లో చేరిక..!

ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు  తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయం నుంచి  అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రతిపక్షాలకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి నవంబర్ మూడవ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగా వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

ఈ దాఖలైన నామినేషన్లను ఈరోజు నుంచి ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. దీనికోసం అబ్జర్వర్లను ఇప్పటికే ఈసీ నియమించింది. అబ్జర్వర్లుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులకు బాధ్యతలను అప్పజెప్పింది.  మరోవైపు సాధారణ పరిశీలకులుగా 67 మంది అధికారులను నియమించింది. 39 మంది ఐపీఎస్ అధికారులకు పోలీసు పరిశీలకులుగా నియమించింది. వీరితోపాటు మరో 60 మంది అయ్యారు అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ  ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 166 మంది అబ్జర్వర్లు నామినేషన్ల పరిశీలన  చేయనున్నారు. 

ఈ ఎన్నికల్లో ఏ ఏ పార్టీలు ఎన్ని స్థానాలకు పోటీకి దిగుతున్నాయి అంటే..

- బీఆర్ఎస్ మొత్తం 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తోంది
-కాంగ్రెస్ 118 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తూ..  ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సిపిఐకి వదిలేసింది
- మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిజెపి రాష్ట్రవ్యాప్తంగా 111 స్థానాలకు పోటీ చేస్తుంది.
- తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకున్న బిజెపి ఆ పార్టీకి 8 స్థానాలను ఇచ్చింది.
-మరోవైపు ఎంఐఎం  9 స్థానాల్లో నేరుగా పోటీకి దిగుతుంది. మిగిలిన 110 స్థానాల్లో అధికార బీఆర్ఎస్ కు మద్దతిస్తోంది

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios