Asianet News TeluguAsianet News Telugu

బిజెపికి తుల ఉమా రాజీనామా.. నేడు బీఆర్ఎస్ లో చేరిక..!

వేములవాడ బీజేపీలో చోటు చేసుకున్న హైడ్రామాకు చివరికి తెరపడింది. తుల ఉమా కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. పార్టీలో చేరే విషయం చర్చించారు.

Tula Uma resigns from BJP,  joining to BRS today - bsb
Author
First Published Nov 13, 2023, 10:18 AM IST

హైదరాబాద్ : బీజేపీ నేత తుల ఉమా సొంతగూటికి చేరనున్నారు. దీంతో నాలుగు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది. వేముల వాడ నుంచి బీజేపీ టికెట్ ఆశించిన ఆమె చివరి నిమిషంలో తీవ్ర అవమానాల పాలయ్యారు. వేములవాడ అసెంబ్లీ సీటుకు టికెట్ ఇచ్చిన బీజేపీ.. చివరి నిమిషంలో బీఫామ్ వేరొకరికి ఇచ్చింది. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 

తన అనుచరులతో సమావేశాల అనంతరం తిరిగి బీఆర్ఎస్ లో చేరడానికి నిర్ణయించుకున్నారు. కేసీఆర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. పార్టీలో చేరే విషయం చర్చించారు. కేసీఆర్ స్పష్టమైన హామీల తరువాత బీఆర్ఎస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె అనుచరులు నిన్నటినుంచి సిరిసిల్లా లోని బీఆర్ఎస్ కార్యాలయంలోనే ఉన్నారు. నేడు ప్రగతిభవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios