తెలంగాణ ఎన్నికలు 2023 : కాంగ్రెస్ కు భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్.. చేరికలే చేరికలు...

నామినేషన్లు ముగిసిన తరువాత కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు, అనుచరులు బీఆర్ఎస్ లోకి చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ విజయావకాశాలు సన్నగిల్లనున్నాయా?

Telangana Elections 2023 : KCR gave a big shock to the Congress  - bsb

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ముగిసిన వేళ కాంగ్రెస్ కు ఓకించన్ ఊహించని షాక్ ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ లోకి చేరికల పర్వం జోరందుకుని హౌస్ ఫుల్ అయిపోవడంతో.. ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక అయోమయంలో ఉన్న కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు మొదలయ్యాయి. ఇన్ని రోజులు చేరికలపై పెద్దగా దృష్టి పెట్టని బిఆర్ఎస్.. ఇప్పుడు కారులో ఎక్కించుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో చేరికల పర్వానికి తెరలేపింది.

టిఆర్ఎస్ నుంచి పెద్ద స్థాయిలో కాంగ్రెస్లోకి వలసలు జరగడంతో టికెట్లు ఎవరికియాలో తెలియక సొంత పార్టీ ముఖ్య నేతలు సీనియర్లను సైతం పక్కన పెట్టి టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్. దీంతో రాష్ట్రంలోని ఒక ట్రెండు స్థానాల్లో తప్ప మిగతా అంతా హైకమాండ్ అనుకున్నట్లే జరిగింది. అయితే నామినేషన్ల పర్వం ఒకటి వేయడంతో ప్రస్తుతం పార్టీని  విజయతీరాల వైపు పయనించేలా చేయడం కోసం కేసీఆర్ దృష్టి సారించారు.

Neelam Madhu: బీఆర్ఎస్ టు కాంగ్రెస్ టు బీఎస్పీ.. పటాన్‌చెరులో ‘నీలం’ టికెట్‌పై బరిలో మధు

దీంట్లో భాగంగానే.. బిఆర్ఎస్ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆయా జిల్లాలు, నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఆయా జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థుల ముఖ్య అనుచరులు టికెట్లు ఆశించి.. రాని నేతలు, ద్వితీయ శ్రేణికి చెందిన కాంగ్రెస్ నేతలను కారులో ఎక్కించుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పై దృష్టి సారించారు. ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీట్ చేస్తుందని సంకేతాలు ఉన్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత ఖమ్మంలో  అధికార పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది.  

ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేసేందుకు కొంతమంది ముఖ్య నేతలకు  గులాబీ కండువా కప్పారు. టికెట్లు కేటాయించారు. ఇది చాలాదనుకున్న గులాబీ బాస్… జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ప్రముఖులను, ముఖ్య నేతలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి చేరికలు భారీగా జరిగాయి. అనుకోని ఈ పరిణామానికి కాంగ్రెస్కు ఖమ్మం జిల్లాలో భారీ కుదుపు ఎదురయింది.

ఇప్పటివరకు ఎవరెవరు బీఆర్ఎస్ లో చేరారు అంటే… పీసీసీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు, విద్యార్థినేతగా పేరు ఉన్న కూటూరి మానవతారాయ్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, సీనియర్ రాజకీయ నేత వూకే అప్పయ్య దంపతులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, డాక్టర్ రామచంద్రనాయక్ లతో పాటు  పలువురు సీనియర్ నేతలు కారెక్కారు. వీరందరికీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తగిన ప్రాధాన్యత  కల్పిస్తామని,  పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీని మీద కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios