సోమవారం ఉదయం మంత్రి సబిత బంధువులు, సంబంధితుల ఇళ్లలో ఐటీ దాడులు నిర్వహిస్తోంది.
హైదరాబాద్ : ఎన్నికలకు కొద్ది రోజులే గడువున్న సమయంలో హైదరాబాద్ లో ఐటీ దాడులు తీవ్రం చేస్తోంది. సోమవారం ఉదయం మరోసారి దాడులు మొదలుపెట్టింది. హైదరాబాద్ వ్యాప్తంగా 15చోట్ల ఐటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బంది, ఇల్లు ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

మై హోం భూజాలో ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయనాయకులపై దాడులు చేసిన ఐటీ.. ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
