Telangana Election Results..రెండుసార్లు బీఆర్ఎస్‌కే పట్టం: కాంగ్రెస్ పట్టు సాధించేనా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని దక్కించుకుంది. ఈ దఫా ఓటరు తన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విజయం సాధించింది.ఈ రెండు ఎన్నికల్లో అధికారం దక్కించుకొనేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి నిరాశే ఎదురైంది. దక్షిణాదిలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న కమల దళానికి తెలంగాణలో ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే ఈ దఫా మెరుగైన ఫలితాలు వస్తాయని భారతీయ జనతా పార్టీ ఆశతో ఉంది.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి. 2014లో అప్పట్లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి.ఈ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ,తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐ కలిసి పోటీ చేశాయి. సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది.
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో భారత రాష్ట్ర సమితి 63 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 34.3 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి 26.1 శాతం ఓట్లు దక్కాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. తెలంగాణలో టీడీపీకి 15 అసెంబ్లీ స్థానాలతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం కూడ దక్కింది. బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో టీడీపీ 15 శాతం ఓట్లను సాధించింది. బీజేపీ సుమారు ఆరు శాతం ఓట్లను దక్కించుకుంది.2014 ఎన్నికల్లో టీడీపీ 72 స్థానాల్లో బరిలోకి దిగింది. మిగిలిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. టీడీపీ 15 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది.ఇతరులకు 14.8 శాతం ఓట్లను దక్కించుకున్నారు.
2014 ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే బీఎస్పీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడ బీఆర్ఎస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం మరింతగా పెరిగింది. తెలుగుదేశం పార్టీ నుండి సనత్ నగర్ నుండి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీఎస్పీ నుండి గెలిచిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ ని బీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డిని కూడ కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
2018లో నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. ఆరు మాసాల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో కూడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి మహా కూటమిగా పోటీ చేశాయి. సీపీఐ(ఎం) మాత్రం బహుజన లెఫ్ట్ ప్రంట్ పేరుతో ఒంటరిగా పోటీ చేసింది.
2018లో బీఆర్ఎస్ కు 47.4 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ 19 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇందులో 28.7 శాతం ఓట్లను దక్కించుకుంది. ఎంఐఎం ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎంకు 2.7 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఆశ్వరావుపేట అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 3.5 ఓట్లు దక్కాయి. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. టీడీపీ ఓట్ల శాతం 3.5 శాతానికి పడిపోయింది.
ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఆయన 3.3 శాం ఓట్లు పొందారు.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. 2014లో బీఆర్ఎస్ కు 34.04 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం 46.9 శాతానికి పెరిగింది. 2014తో పోలిస్తే బీఆర్ఎస్ ఓట్ల శాతం 12.86 శాతం పెరిగింది. 2014లో బీఆర్ఎస్ 63 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2018లో బీఆర్ఎస్ 88 స్థానాలను దక్కించుకుంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు.
2014లో టీడీపీ,బీజేపీ మధ్య పొత్తు ఉంది. 2018 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. 2014 ఎన్నికల్లో 7.1 శాతం ఓట్లతో బీజేపీ ఐదు స్థానాలను గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఆ పార్టీ కేవలం ఒక్క సీట్లో మాత్రమే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో 7.1 శాతం కంటే తక్కువగా ఉంది.
also read:Telangana Exit polls 2023: తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగింది. 119 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. సీపీఐ ఒక్క స్థానంలో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో బరిలోకి దిగింది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. బీజేపీ 111 స్థానాల్లో , జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. సీపీఐ(ఎం) ఒంటరిగా బరిలోకి దిగింది. రాష్ట్రంలోని 19 అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ(ఎం) అభ్యర్ధులు పోటీ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.