Asianet News TeluguAsianet News Telugu

Telangana Election Results: కాంగ్రెస్ ను అభినందించాల్సిందే.. మేం వెనకబడ్డాం -ఎంపీ కేశవ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో దూసుకుపోతుండంతో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు స్పందించారు. ఆ పార్టీని అభినందించాల్సిందేనని అన్నారు. తాము వెనకబడ్డామని అంగీకరించారు. 

Telangana Election Results: Congress should be congratulated.. We have fallen behind - MP Keshava Rao's interesting comments..ISR
Author
First Published Dec 3, 2023, 11:20 AM IST

Telangana Assembly Election Results 2023 :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. అధికార బీఆర్ఎస్ వెనకబడింది. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ కీలక నాయకులు, ఎంపీ కేశవరావు స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి పనితీరు కనబరిచిందని, ఆ పార్టీని అభినందించాల్సిందేనని అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kodangal Election Results 2023 : కొడంగల్ లో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి..

వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేశవరావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో తమ పార్టీ  (బీఆర్ఎస్) వెనుకబడిందని అంగీకరించారు. ‘‘ వారిని అభినందించాల్సిందే. ఇది జోక్ కాదు.. ఆ పార్టీ లీడ్ లో ఉంది. మేము వెనకబడ్డాం. గణాంకాలు చెబుతాయి కాబట్టి దీన్ని అంగీకరించక తప్పదు. ఆ విషయాలను దాచిపెట్టే ప్రసక్తే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

అయితే కాంగ్రెస్ కు కేశవ రావు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ.. తెలంగాణలో తమ పార్టీ మూడో సారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వే సంస్థలు వేసిన అంచనాలను తాను తప్పు పట్టనని, కానీ తన అధ్యయనం ప్రకారం అధికారంలోకి రావడానికి తమకు సౌకర్యవంతమైన మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Telangana Election Results: సొంత నియోజకవర్గంలో కేటీఆర్ కి షాక్..?

తెలంగాణలోని 199 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. నేటి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తరువాత ఈవీఎంల లెక్కింపు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ 67 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. బీఆర్ఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 11 స్థానాల్లో, ఎంఐఎం 3 స్థానాల్లో తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios