సారాంశం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ అత్యధిక మెజారిటీతో దూసుకుపోతున్నారు. 

కొడంగల్ : కొడంగల్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇలాకా. దీనికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి లీడ్ లో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పట్నం నరేందర్, బీజేపీ నుంచి బి. రమేశ్ కుమార్ లు పోటీలో ఉన్నారు. 

ఆరవ రౌండ్ ముగిసేసరికి కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 584 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్,  బొమ్రాస్ పేట,  దుద్వాల్,  దౌల్తాబాద్,  కోస్గి, మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. 

కొడంగల్ లో 2009, 2014లలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీనుంచి గెలిచారు. ఆ తరువాత 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లైవ్