Kalvakuntla chandrashekar rao:గవర్నర్ కు రాజీనామా సమర్పించిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా సమర్పించారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రాజీనామా చేశారు. గవర్నర్ తమిళిసైకి రాజీనామా పత్రం సమర్పించారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసైకి పంపారు. రాజ్ భవన్ సిబ్బంది ఈ రాజీనామా పత్రాన్ని తీసుకున్నారని సమాచారం. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఈ రాజీనామా లేఖను అందించనున్నట్టుగా రాజ్ భవన్ సిబ్బంది సమాచారం పంపారు. మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు స్వంత వాహనంలో వెళ్లారు.
also read:N.Uttam Kumar Reddy..నెరవేరిన శపథం: గడ్డం తీయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
2014, 2018 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.రెండు ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మూడో దఫా కూడ తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలని వ్యూహలు రచించారు. సుమారు 96 ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ కు మూడో దఫా అధికారాన్ని కట్టబెట్టలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీని ఇచ్చారు తెలంగాణ ప్రజలు. దీంతో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు.
also read:Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్
ఆదివారంనాడు సాయంత్రం కేసీఆర్ తన ఓఎస్‌డీ ద్వారా రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపారు. తొలుత కేసీఆర్ రాజ్ భవన్ కు వస్తారని ప్రచారం సాగింది. అయితే కేసీఆర్ మాత్రం రాజ్ భవన్ కు వెళ్లలేదు. రాజ్ భవన్ కు కాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. తన ఓఎస్‌డీ ద్వారా కేసీఆర్ రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపారు.