Telangana Election Results 2023: కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థి గెలుపు!.. లీడ్‌లో, గెలిచిన కమలం అభ్యర్థులు వీరే
కామారెడ్డి స్థానంలో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి వెంకట రమణా రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. ఈ స్థానంలో కేసీఆర్ మూడో స్థానంలో నిలువగా రేవంత్ రెడ్డి, కాటిపల్లిల మధ్య పోటీ నెలకొంది. రౌండ్లు నిండుకుంటున్న తరుణంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతున్నది. సుమారు పది సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అటూ ఇటూగా అంచనా వేశాయి. ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీజేపీ హవా నడుస్తున్నట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికి 9 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తున్నారు. సీఎం కే చంద్రశేఖర్ రావును సైతం బీజేపీ అభ్యర్థి ఓడిస్తున్నారు.
ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్ గెలుపొందారు. నిజామాబాద్ అర్బన్ సీటులో బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ విజయం సాధించారు. నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం కావడం గమనార్హం. కామారెడ్డిలో దాదాపు బీజేపీ అభ్యర్థి కాటిపల్లి విజయం ఖాయం అవుతున్నది. 14వ రౌండ్‌లో 1717 ఓట్ల మెజార్టీతో ఆయన దూసుకుపోతున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి విజయం దిశగా వెళ్లుతున్నారు.
Also Read: బర్కెలక్క ఓటమి.. జూపల్లిదే విజయం..live updates
లీడ్‌లో ఉన్న బీజేపీ అభ్యర్థుల వివరాలు చూస్తే.. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం ముధోల్‌లో 23 రౌండ్లకు గాను 20వ రౌండ్ వరకు ముధోల్ గెలుపు దాదాపు ఖాయం అవుతున్నది. 19 వేల మెజార్టీతో ఆయన ఉననారు. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్ బాబు మూడు వేల ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఆర్మూర్‌లో పైడి రాకేశ్ రెడ్డి, కార్వాన్‌లో అమర్ సింగ్ 6,700 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.