సారాంశం


ప్రజా ఆశీర్వాద సభల్లో  కాంగ్రెస్ ను  లక్ష్యంగా చేసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏ రకంగా అన్యాయం చేసిందో వివరిస్తున్నారు.  

బోధన్:తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని సీఎం కేసీఆర్  చెప్పారు.బుధవారంనాడు బోదన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  కేసీఆర్ ప్రసంగించారు.1969లో 400 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిందన్నారు. వందలమంది ఉద్యమకారులను చంపిన  చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. సమైఖ్య రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టిందన్నారు.

అభ్యర్థుల గుణగణాలను  పరిగణనలోకి తీసుకొని ఓటేయాలని కేసీఆర్ ప్రజలను కోరారు. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలన్నారు.ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ది జరుగుతుందన్నారు.గుడ్డిగా గులాబీ పార్టీకి ఓటు వేయాలని తాను కోరడం లేదన్నారు.   మహారాష్ట్ర వాళ్లు కూడ తెలంగాణలో అమలు చేస్తున్న  పథకాలు కావాలని కోరుతున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.  

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వద్దని  కాంగ్రెస్ చెబుతుందన్నారు.  మూడు గంటల కరెంట్  సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. 24 గంటల విద్యుత్ కావాలంటే  బీఆర్ఎస్ ను గెలిపించాలని  ఆయన కోరారు. మూడు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని ఆయన కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  స్వంత రాష్ట్రంలో కూడ  వ్యవసాయానికి  24 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదన్నారు.

also read:50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మన బతుకులు మారాయా?:ఇబ్రహీంపట్టణం సభలో కేసీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  ధరణిని తీసివేస్తామని  రాహుల్ గాంధీ  చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావించారు.  ధరణిని తీసివేస్తే  రైతుబంధు ఎలా వస్తుందని ఆయన  ప్రశ్నించారు.