vote from home : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. మొదలైన ఓట్ ఫ్రం హోం..
telangana assembly election 2023 : తెలంగాణలో ఓట్ ఫ్రం హోం మొదలైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, వికలాంగుల కోసం ఈ సారి ఎన్నికల కమిషన్ ఈ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఎన్నికల అధికారుల సమక్షంలో వారు ఓటును ఉపయోగించుకుంటున్నారు.
telangana assembly election 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగన్నాయి. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. అయితే ఎన్నికలకు దాదాపు 9 రోజుల ముందే పలువురు ఓటు వేశారు తెలుసా.. అదేలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారా ?.. ఎన్నికల సంఘం తీసుకొచ్చిన వెసులుబాటు వల్ల ఇది సాధ్యమైంది.
రాష్ట్రంలో మొదటిసారిగా ఈ సారి వృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. దీని కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇలా దరఖాస్తులు చేసుకున్న వారు మంగళవారం ఎన్నికల అధికారి సమక్షంలో ఓటు వేశారు. ఇలా హైదరాబాద్ లోని పలువరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే హైదరాబాద్ కు చెందిన 91 ఏళ్ల మహిళ తొలి ఓటు వేసి రికార్డు నెలకొల్పారు. ఎన్నికల అధికారుల సమక్షంలో ఆమె తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.