Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ వాయు కాలుష్యం.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రైతులను విలన్లుగా చూపిస్తున్నారని వ్యాఖ్య..

ఢిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులు పంట వ్యర్థాలు నిర్వహణను ప్రభుత్వం 100 శాతం ఎందుకు ఉచితంగా కల్పించడం లేదని ప్రశ్నించింది. 

Delhi air pollution..Supreme court is angry with Punjab government..Comment that farmers are shown as villains..ISR
Author
First Published Nov 21, 2023, 2:41 PM IST | Last Updated Nov 21, 2023, 2:41 PM IST

delhi air pollution : పంట అవశేషాల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం 100 శాతం ఉచితంగా ఎందుకు చేపట్టడం లేదని సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.పంట వ్యర్థాల నిర్వహణకు యంత్రాన్ని ఇచ్చినా.. డిజీల్ ఖర్చు, సిబ్బంది ఖర్చు వంటివి ఉంటాయని తెలిపింది. అయితే దీనికి బదులు వాటిని కాల్చాలంటే రైతుకు ఒక్క అగ్గిపుల్ల వెలిగిస్తే సరిపోతుందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

రైతులను విలన్లుగా చూపిస్తున్నారని, వారి వాదనలు కోర్టులో వినిపించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాము ఆదేశాలు జారీ చేస్తుంటే వారు ఇక్కడే ఉండాలని జస్టిస్ ధూలియా అన్నారు. పంజాబ్ ప్రభుత్వం డీజిల్, మానవ వనరులు మొదలైన వాటికి నిధులు సమకూర్చి ఉపఉత్పత్తును ఎందుకు ఉపయోగించుకోలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చే విధానంలో పంజాబ్ కూడా హరియాణాను ఆదర్శంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 

యంత్రాంగానికి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది. కాలుష్యాన్ని తగ్గించడంలో నిందలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. పంట వ్యర్థాలను తగలబెట్టినందుకు రైతుల నుంచి రూ.2 కోట్ల నష్టపరిహారం వసూలు చేశామని అడ్వొకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ చేసిన వాదనపై కోర్టు స్పందించింది.

వరిని ఎలా నిరుత్సాహపరచవచ్చో, ప్రత్యామ్నాయ పంటలను ఎలా ప్రోత్సహించవచ్చో పరిశీలించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.  పంజాబ్ లో భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో భూమి శుష్కంగా మారుతోందని, భూమి ఎండిపోతే మిగతావన్నీ దెబ్బతింటాయని తెలిపింది. ఎక్కడో ఒకచోట రైతులు వరి సాగు చేయడం వల్ల కలిగే పరిణామాలను అర్థం చేసుకోవాలని కోర్టు పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios