Barrelakka : 2+2 గన్ మెన్లతో సెక్యూరిటీ... తెలంగాణ హైకోర్టుకు బర్రెలక్క

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శిరీష (బర్రెలక్క) పోటీ సంచలనం అనే చెప్పాలి.  ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆమెకు రోజురోజుకు మద్దతు పెరిగిపోతోంది. తాజాగా ప్రముఖ హీరో, కాంగ్రెస్ నాయకుడొకరు ఆమెకు మద్దతు ప్రకటించారు.  

Telangana Assembly Elections 2023 .... Telangana High Court Inquiry on Barrelakka Security petition AKP

కొల్లాపూర్ : ఈ సోషల్ మీడియా జమానాలో సామాన్యులు సైతం ఓవర్ నైట్ ఫేమస్ అవుతున్నారు. ఇలా తెలంగాణ నిరుద్యోగుల కోసం చిన్న రీల్ చేసి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు  కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన శిరీష తనకు గన్ మెన్లతో సెక్యూరిటీ కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. బర్రెలక్క పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు  విచారించనుంది.  ఆమెకు కోర్టు సెక్యూరిటీ కల్పిస్తే ఎమ్మెల్యేగా గెలవకముందే గన్ మెన్లను కలిగిన నాయకురాలిగి బర్రెలక్క మారనున్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఏదో ఆషామాషీగా ఆమె పోటీచేయడం లేదు... సీరియస్ గా గెలుపుకోసం పోరాడుతున్నారు. కొల్లాపూర్ లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఆమె ప్రచారం చేస్తుండగా కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి యత్నించారు. ఈ దాడినుండి శిరీష తప్పించుకున్నా ఆమె సోదరుడు మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా తనపై దాడికి భయపడిపోకుండా రక్షణ కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు బర్రెలక్క. 

కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న తనకు ప్రాణహాని వుందని... 2+2 గన్ మెన్ల రక్షణ కల్పించాలంటూ శిరీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల కమీషన్ ను ఆదేశించాలని ఆమె కోరుతోంది. ఈ పిటిషన్ పై విచారణ జరపనున్న న్యాయస్థానం తీర్పును కూడా ఇవాళే వెలువరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Read More  Barrelakka :బర్రెలక్క మేనిఫెస్టో ఇదే..

ఇదిలావుంటే కీలక నాయకులు బరిలో నిలిచిన కొల్లాపూర్ లో శిరీష పోటీచేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ నుండి బీరం హర్షవర్దన్ రెడ్డి, కాంగ్రెస్ నుండి జూపల్లి కృష్ణారావు,  బిజెపి నుండి అల్లెని సుధాకర్ రావు వంటి పెద్దనాయకులపై ఎవరి సపోర్ట్ లేకుండా, ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా ఇండిపెండెంట్ గీ శిరీష బరిలోకి దిగింది. దాడులు జరుగుతున్నా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళుతున్న బర్రెలక్క దైర్యానికి మెచ్చుకుని చాలామంది ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.  

ప్రముఖ హీరో, ప్రస్తుతం మతబోధకుడిగా మారిన రాజా సైతం బర్రెలక్కకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వున్నప్పటికీ శిరీష గెలవాలని తాను కోరుకుంటున్నానని... అధిష్టానం తనను మందలించినా సరే ఆమెకు మద్దతుగా నిలుస్తానని అన్నారు. ధైర్యంగా పోటీలో నిలిచిన ఆమె గెలవాలని కోరుకుంటున్నట్లు రాజా తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios