Asianet News TeluguAsianet News Telugu

Barrelakka :బర్రెలక్క మేనిఫెస్టో ఇదే.. 

Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల పక్షాన కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న శిరీష(బర్రెలక్క) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఎన్ని బెదిరింపు వచ్చినా.. పోటీ నుంచి మాత్రం తగ్గడం లేదు. ప్రచారంలో దూసుకెళ్తూ..నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో ప్రధానాంశాలివే..   

telangana elections Barrelakka releases manifesto KRJ
Author
First Published Nov 23, 2023, 10:27 AM IST

Barrelakka : బర్రెలక్క.. ఇప్పడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం. ఎన్ని డిగ్రీలు చదివినా.. ఏం లాభం ప్రభుత్వ ఉద్యోగాలు రావడంలేదు.. అందుకే బర్లు కాసుకుంటున్నా.. అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది శిరీష. ఆ అమ్మాయి పెట్టిన వీడియో అప్పట్టో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఆ వీడియో ఆధారంగా అటు ప్రతిపక్షాలు, ఇటు నిరుద్యోగులు ఉద్యోగ కల్పనపై సర్కార్ పై విమర్శాస్త్రాలు సంధించారు. దీంతో ఆ యువతి  బర్రెలక్కగా ఫేమస్ అయింది. 

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల పక్షాన కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రధానంగా శిరీష(బర్రెలక్క)కు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ క్రమంలో ఆమెకు ఎన్ని బెదిరింపు వచ్చినా.. పోటీ నుంచి మాత్రం తగ్గడం లేదు ప్రచారంలో దూసుకెళ్తుంది. తాజాగా నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా మేనిఫెస్టో విడుదల చేసింది.  

బర్రెలక్క మేనిఫెస్టో ఇదే..  

1. నిరుద్యోగ పక్షనా.. అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు విడుదల అయ్యేలా నిలదీస్తా

2. పేదల ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా..

3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులందరికీ భృతి ఇప్పిస్తా..

4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతా..

5. ఉచిత విద్య, వైద్యం కోసం కృషి చేస్తా..

6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు- ఫ్రీ కోచింగ్ అందిస్తా..

7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్ అందించి ప్రోత్సహిస్తా..
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios