Mallareddy : మంత్రి మల్లారెడ్డి సన్నిహితుడి ఇంట్లో ఈసి తనిఖీలు 

తెెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ వేళ ఈసి పోలీసులు అప్రమత్తం అయ్యారు. అధికాార, ప్రతిపక్ష నాయకులని తేడాలేకుండా అనుమానం వచ్చినవారిపై ఇళ్లు, వాహనాలు తనిఖీ చేస్తున్నారు. 

Telangana Assembly Elections 2023 ... Police and EC officers raid in Minister Mallareddy follower House AKP

మేడ్చల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహం తగ్గించేందుకు ఎన్నికల కమీషన్, పోలీసులు సంయుక్తంగా  సోదాలు చేపట్టారు. అధికార, ప్రతిపక్ష నాయకులని తేడా లేదు... ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే దాడులు చేపడుతున్నారు. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రత్యేక చెక్ పోస్టులు  ఏర్పాటుచేసి వాహనాల తనికీ చేపడుతున్న పోలీసులు పోలింగ్ కు సమయం దగ్గరపడటంతో నాయకులు ఇళ్లలోనూ తనిఖీలకు దిగారు. ఇలా అధికారపార్టీకి చెందిన ఓ మంత్రి సన్నిహితుడి ఇంట్లో ఈసి అధికారులు తనిఖీలు చేపట్టారు.  

హైదరాబాద్ శివారులోని మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో మంత్రికి సంబంధించిన వారినీ పోలీసులు వదిలిపెట్టడం లేదు. మల్లారెడ్డికి అత్యంత సన్నిహితుడు, బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు.  

భారీగా పోలీసులను తీసుకుని ఈసి ప్లయింగ్ స్క్వాడ్ సంజీవరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ సోదాల విషయం తెలిసి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో సంజీవరెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. 

Read More  Barrelakka : 2+2 గన్ మెన్లతో సెక్యూరిటీ... తెలంగాణ హైకోర్టుకు బర్రెలక్క

ఇక తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల వాహనాల తనిఖీ కొనసాగుతోంది. ఈ క్రమంలో భారీగా డబ్బు పట్టుబడుతోంది.  ఇటీవల హైదరాబాద్ అప్పా జంక్షన్ లో వాహనాల తనికీ చేపట్టిన పోలీసులు రూ.7.4 కోట్లు పట్టుకున్నారు. ఈ డబ్బును ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కోసం తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోనూ రూ.5 కోట్లు పట్టుబడ్డాయి.  ఇలా ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంలో వందల కోట్ల డబ్బులు, వందల లీటర్ల మద్యం, ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న బహుమతులు పట్టుబడ్డాయి. 

అలాగే ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు సాగుతున్నాయి. ఇటీవలే బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరిన వివేక్  వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డతో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులు, వారి సన్నిహితులపైనా ఇన్కమ్ టాక్స్ దాడులు జరిగాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios