Asianet News TeluguAsianet News Telugu

Breaking : కేసీఆర్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే షాక్... మరికొద్దిసేపట్లో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి 

బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృఫ్తితో వున్న ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమయ్యింది. మరికొద్దిసేపట్లో ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

Telangana Assembly Elections 2023 ... Alampur BRS MLA Abraham ready to join Congress Party AKP
Author
First Published Nov 24, 2023, 10:14 AM IST

మహబూబ్ నగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు మరో వారంరోజులే సమయముంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార బిఆర్ఎస్ కు ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే షాకిచ్చాడు. తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్న బిఆర్ఎస్ పార్టీకి కీలక సమయంలో దెబ్బేస్తున్నాడు. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే అబ్రహం ప్రతిపక్ష కాంగ్రెస్  లో చేరనున్నారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ తనకు ఆలంపూర్ టికెట్ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ పై అసంతృప్తితో రగిలిపోతున్నాడు అబ్రహం. దీంతో అతడితో టచ్ లోకి వెళ్లారు ఏఐసిసి కార్యదర్శి, ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్. తన గెలుపు కోసం సహకరిస్తే భవిష్యత్ లో మంచి అవకాశాలు ఇస్తామని ఒప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జోష్ ను చూస్తున్న అబ్రహం కూడా అధికారంలోకి వచ్చేది ఇదే పార్టీ అన్న నమ్మకంతో వున్నట్లున్నాడు. అందువల్లే అధికార పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు.  

కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఎమ్మెల్యే అబ్రహంను తీసుకుని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం.  జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలోనే అబ్రహం కాంగ్రెస్ లో చేరనున్నారు. 

ఇక ఇప్పటికే పాలమూరు జిల్లాకు చెందిన బిఆర్ఎస్ సీనియర్లు జూపల్లి కృష్ణారావు, మందా జగన్నాథం వంటివారు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం చేరుతున్నారు. ఇలా వరుస చేరికలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ లో ఊపు పెరిగింది.  

Read More  KTR: కేవ‌లం డైలాగులతో రైతుల ఆదాయం రెట్టింపు కాదు.. ప్రధాని మోడీ పై కేటీఆర్ ఫైర్

తనకు సీటు కేటాయించి తిరిగి వెనక్కి తీసుకున్నపుడే పార్టీ మారేందుకు అబ్రహం సిద్దమైనట్లు తెలుస్తోంది. ముందుగా తన అనుచరులు, వెంటనడిచే ప్రజాప్రతినిధులు ఆయన కాంగ్రెస్ లోకి పంపారు. ఇలా ఇప్పటికే ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని నలుగురు జెడ్పిటిసిలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సరిగ్గా ఎన్నికలకు మరో వారంరోజులు సమయం వుందనగా కేసీఆర్ పార్టీకి షాకిస్తూ అబ్రహం కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. 

బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముందుగా ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ లో ఆలంపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు వుంది. దీంతో ఆయన ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో బిజీబిజీగా వున్నారు. సరిగ్గా నామినేషన్ కోసం సిద్దమవుతున్న అబ్రహంకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాకిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ను క్యాన్సిల్ చేసి కొత్తవారికి అవకాశం కల్పించారు. మ్మెల్యే అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజెయుడికి కేటీఆర్ భీఫామ్ అందించారు. దీంతో అబ్రహంతో పాటు ఆయన వర్గం షాక్ కు గురయ్యింది.  

 బిఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని... అయితేనే పార్టీ గెలుపు సాధ్యమని సీఎం కేసీఆర్ ను ఆయన సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మొదట ప్రకటించిన అబ్రహంకు కాదని చల్లా వర్గానికే చెందిన విజేయుడికి ఆలంపూర్ టికెట్ ఇచ్చి బరిలోకి దింపారు కేసీఆర్.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios