బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు : ఎల్లారెడ్డి రోడ్ షోలో మంత్రి హరీశ్‌రావు

కేసీఆర్ మూడోసారి తెలంగాణకు సీఎం అవుతారని జోస్యం చెప్పారు మంత్రి హరీశ్ రావు. పదేళ్లలో పాలనలో రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ది చేశామని.. ఎల్లారెడ్డిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చామని మంత్రి స్పష్టం చేశారు. 

telangana assembly election 2023: minister harish rao road show at yellareddy ksp

కేసీఆర్ మూడోసారి తెలంగాణకు సీఎం అవుతారని జోస్యం చెప్పారు మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణలో అత్యధిక అభివృద్ధి చేసింది కేసీఆరే అన్నారు. మూడోసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్లుగా హరీశ్ తెలిపారు. పదేళ్లలో పాలనలో రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ది చేశామని.. ఎల్లారెడ్డిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చామని మంత్రి స్పష్టం చేశారు. 

జాజాల సురేందర్‌ను మరోసారి గెలిపించాలని హరీశ్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే రూ.400కు గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.3000 ఆర్ధిక సాయం, అసైన్డ్ భూములకు పట్టాలు అందిస్తామని హరీశ్ హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 3000 ఇళ్ల నిర్మాణం జరిగిందని.. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 10000 ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి పేర్కొన్నారు. 

ALso Read: KTR: కేవ‌లం డైలాగులతో రైతుల ఆదాయం రెట్టింపు కాదు.. ప్రధాని మోడీ పై కేటీఆర్ ఫైర్

ఇకపోతే.. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి క‌ల్వ‌కుంట్ల తారక రామారావు (కేటీఆర్) మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్రధాని మోడీ గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ డైలాగులు, జుమ్లాలతో  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ.. 'ట్రైల్‌బ్లేజర్ తెలంగాణ' పేరుతో ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమస్యలు ఉన్నప్పటికీ, దశాబ్దంలో రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధించిందనీ, ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయంలో అత్యధికంగా ఉందని తెలిపారు.

స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని కూడా ఆయన హైలైట్ చేశారు. "రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం గురించి ప్రధాని మాట్లాడుతున్నారు. కేవ‌లం డైలాగులతో రైతుల ఆదాయం రెట్టింపు కాదు. రైతుల ఆదాయం జుమ్లాలతో (గాలి వాగ్దానాల‌తో) రెట్టింపు కాదు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే వ్యవసాయం, అనుబంధ రంగాలను కూడా ఆదుకోవాలి. సరిగ్గా ఇదే తెలంగాణ చేసింది" అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కరువును అధిగమించే లక్ష్యంతో ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) రూ.1.70 లక్షల కోట్లతో కాళేశ్వరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారనీ, ఆ లక్ష్యంలో విజయం సాధించారని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios