T Raja Singh : గోషామహల్ మళ్లీ రాజా సింగ్ దే.. మూడో సారి విజయ ఢంకా మోగించిన బీజేపీ ఫైర్ బ్రాండ్..
Goshamahal Assembly Elections Results 2023 : గోషామహల్ ముచ్చటగా మూడో సారి కాషాయ జెండా ఎగిరింది. ఆ స్థానం నుంచి బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ భారీ మెజారిటీతో గెలిచారు. ఈ స్థానాన్ని దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నించిన బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం అయ్యింది. కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.
Telangana Elections 2023 : గోషామహల్ నియోజకవర్గం. ఇది బీజేపీ కంచు కోట. రాష్ట్రంలో 2018లో ఆ పార్టీ గెలిచిన ఒకే ఒక్క స్థానం. ఇక్కడి నుంచి ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ టి. రాజా సింగ్ ముచ్చటగా మూడో సారి గెలిచారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా.. రాజా సింగ్ పవనాల ముందు తట్టుకోలేకపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి నంద కిషోర్ వ్యాస్ పై ఏకంగా 21,457 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తంగా రాజాసింగ్ కు 80,182 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
ఎవరీ జాయింట్ కిల్లర్ వెంకటరమణ రెడ్డి: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ ను ఓడించిన కాటిపల్లి
నంద కిషోర్ వ్యాస్ కు 58,725 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ అభ్యర్థి మొగిలి సునీత 6,265 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా.. రాజాసింగ్ సొంత పార్టీ నుంచి బహిష్కరణ కూడా ఎదుర్కొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మారుపేరైన ఆయన.. గత ఏడాది మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఆ వ్యాఖ్యలకు ఆయనను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే అదే రోజు బెయిల్ పై విడుదలయ్యారు.
https://telugu.asianetnews.com/telangana/ravi-gupta-appointed-new-dgp-of-telangana-krj-s53iw2
ఈ స్థానంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొకస్ పెట్టారు. గోషామహల్ ఈ సారి తప్పకుండా తమ పార్టీ గెలుచుకుంటుందని పలుమార్లు ధీమా వ్యక్తం చేశారు. కానీ రాజాసింగ్ ప్రభావంతో ఆ పార్టీ రెండో స్థానానికే పరిమితం అయ్యింది. ఎన్నికలకు ముందు బీజేపీ ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఈ ఎన్నికల్లో ఆయన స్థానం నుంచే బరిలోకి దింపింది.
Telangana Elections 2023 : హేమాహేమీల ఓటమి... బిజెపి పరాభవానికి కారణాలివే...
2014 మొదటిసారి గోషామహల్ నుంచి రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో 45.18 శాతం ఓట్లు సాధించి 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి గతం కంటే ఇంకా ఎక్కువే మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ కూడా ఇక్కడి నుంచి బలంగా పోటీ చేసినప్పటికీ.. రాజస్థాన్, గుజరాత్ కు చెందిన వలస జనాభా ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆయన విజయాన్ని ఆపలేకపోయింది.