Telangana Elections 2023 : హేమాహేమీల ఓటమి...  బిజెపి పరాభవానికి కారణాలివే...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని సాధిస్తే బిజెపి మాత్రం చతికిలపడింది. ఇలా కమళం పార్టీ ఓడిపోవడానికి ఆ పార్టీ అధిష్టానం స్వయంకృతాపరాధమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Reasons behind BJP defeat in Telangana Assembly Elections 2023 AKP

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అంచనాలు తలకిందులు అయ్యాయి. గత పార్లమెంట్, జిహెచ్ఎంసి ఎన్నికల్లో మంచి పలితం రావడంతో ఇదే అసెంబ్లీ  ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని బిజెపి భావించింది. అలాగే దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల విజయం కూడా బిజెపి కలిసివస్తుందని భావించారు. దీంతో ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా వంటి కీలక నాయకులు తెలంగాణలో ముమ్మర ప్రచారం చేసారు. కానీ బిజెపి అంచనాలు, జాతీయ నేతల ప్రచారాలు కూడా బిజెపికి పెద్దగా లాభంచేయలేదు. ఓ సమయంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి యే అన్న స్థాయినుండి ఇప్పుడు కనీసం రెండంకెల సీట్లు కూడా సాధించలేని పరిస్థితికి బిజెపి చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఓట్లు, సీట్లు పెరిగినా బిజెపి ఆశించిన పలితం మాత్రం ఇదికాదు. 

తెలంగాణలో 111 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న తాము కనీసం 15-20 సీట్లు సాధిస్తామని ఎన్నికలకు ముందు బిజెపి నాయకులు ధీమా వ్యక్తం చేసారు. కానీ నిన్నటి ఎన్నికల పలితాల్లో ఆ పార్టీ కేవలం 8 సీట్లకే పరిమితం అయ్యింది. తెలంగాణ ఎన్నికల్లో పోలయిన మొత్తం ఓట్లలో బిజెపికి 32 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి... అంటే 14శాతం ఓటింగ్ సాధించిందన్నమాట. కానీ బిజెపి ప్రభావం రాష్ట్రమంతా కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకే పరిమితం అయ్యింది. ఇక్కడే బిజెపి అధిక స్థానాలు సాధించింది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ పై బిజెపి పెట్టుకున్న ఆశలేవీ పలించలేదు. 

ఇలా  తెలంగాణ ఎన్నికల్లో బిజెపి దెబ్బతినడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది ఎన్నికలకు ముందు బిజెపి అధ్యక్షుడి మార్పు.  తెలంగాణలో పార్టీకి మంచి ఊపు తీసుకువచ్చిన బండి సంజయ్ ని సరిగ్గా ఎన్నికలకు ముందు తొలగించడంతో ఆ పార్టీని గట్టిదెబ్బ తీసింది. బిఆర్ఎస్ కోసమే సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారని కాంగ్రెస్ ప్రచారం చేసింది. అంతేకాదు బిఆర్ఎస్, బిజెపి ఒక్కటే అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.

Read More  Telangana Assembly Election Results 2023: ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో విజేతలు వీరే.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలి

ఇక డిల్లీ మద్యం కేసులో కేసీఆర్ కూతురు కవితపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి... అయినా ఆమెపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా తెలంగాణలో పార్టీని దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ కేసులో దాదాపుగా అందరినీ అరెస్ట్ చేయగా ఒక్క కవితను మాత్రమే వదిలిపెట్టారు. ఇదికూడా కాంగ్రెస్ కు అస్త్రంగా మారింది.  బిఆర్ఎస్, బిజెపి ఒక్కటేనని ప్రజలకు వివరించడానికి దీన్ని సక్సెస్ ఫుల్ గా వాడుకుంది కాంగ్రెస్.  

ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కేంద్రం చర్యలు తీసుకోకపోవడం కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపింది. స్వయంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి కీలక నేతలే కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటిఎంగా మారిందని ఆరోపించారు... కానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి వంటివారు పదేపదే కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఫిర్యాదు చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టించుకోలేదు. దీంతో బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈ అంశాలు బిజెపిని బాగా దెబ్బతీసాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios