కొమురం భీమ్‌ జిల్లా సిర్పూర్‌ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్‌ విజయం సాధించారు. ఆయన స్వల్ప ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. 


సిర్పూర్‌ (నిజామాబాద్‌ జిల్లా) నియోజకవర్గంలో ప్రధానంగా నలుగురు పోటీలో ఉన్నారు. వీరిలో బీఆర్‌ఎస్‌ నుంచి కోనేరు కోనప్ప, కాంగ్రెస్‌ నుంచి రావి శ్రీనివాస్‌, బీజేపీ నుంచి పాల్వాయి హరీష్‌లతోపాటు బీఎస్పీ నుంచి మాజీ ఐపీఎస్‌ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు. నాల్గో రౌండ్‌లో బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ లీడ్‌లోకి వచ్చారు. ముందు బీజేపీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. ఏడో రౌండ్‌కి బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ లీడ్‌లో ఉన్నారు. ఆయనకు ఏడో రౌండ్‌లో 2973ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కి 2331 ఓట్లు, కాంగ్రెస్‌కి 181, బీజేపీకి 1869ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు 4759 ఓట్ల ఆధిక్యత కొనసాగింది. ఫైనల్ రౌండ్ లో 3088 ఓట్ల స్వల్ప మెజారిటీతో పాల్వాయి హరీష్‌ గెలుపొందారు. 

read more : తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్‌