Revanth Reddy : అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌‌ వైపే .. రేవంత్ రెడ్డి నివాసానికి భద్రత పెంపు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. అన్ని ఎగ్జిట్ పోల్స్‌‌లోనూ కాంగ్రెస్ పార్టీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డే సీఎం అభ్యర్ధి అనే ప్రచారం జరుగుతూ వుండటం.. నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తూ వుండటంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఇంటికి భద్రత పెంచినట్లుగా తెలుస్తోంది. 

security tightened at tpcc chief revanth reddy residence ksp

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. అన్ని ఎగ్జిట్ పోల్స్‌‌లోనూ కాంగ్రెస్ పార్టీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డే సీఎం అభ్యర్ధి అనే ప్రచారం జరుగుతూ వుండటం.. నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తూ వుండటంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఇంటికి భద్రత పెంచినట్లుగా తెలుస్తోంది. 

అంతకుముందు ఎగ్జిట్ పోల్స్ విడుదలైన వెంటనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ పార్టీ నేతలు నేటీ నుంచి సంబరాలు చేసుకోవచ్చని  తెలిపారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్ముతున్నారనీ, ఎగ్జిట్ పోల్స్  అన్ని కాంగ్రెస్ కే పట్టం కడితే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. 

Also Read: Revanth Reddy: "కేసీఆర్‌ ఓటమి ఖాయం.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు తధ్యం"

ఎగ్జిట్ పోల్స్ తప్పయితే డిసెంబర్ 3న క్షమాపణ చెప్తారా? అంటూ బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలకు ప్రజలంటే చిన్నచూపు అని, ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్ వ్యవహరించారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా వ్యవహరించబోరని, కేసీఆర్ తాను ఓడిపోతానని తెలిసి నియోజకవర్గం మారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి 25కి మించి ఒక్క సీటు కూడా పెరగదని, కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చూపించే మీడియాకు స్వేచ్ఛ ఉంటుందని  అన్నారు. ప్రభుత్వ పాలనలో విపక్షాలకు విలువ ఉంటుందని, పారదర్శక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని  హామీ ఇచ్చారు. 

ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా రాలేదని, కామారెడ్డిలో ప్రజలు కేసీఆర్‌ను ఓడించబోతున్నారని జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని  మెచ్చుకున్నారు. శ్రీకాంతాచారి త్యాగానికి ఎన్నికల తేదీకి ఒక సంబంధం ఉందని, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడబోతున్నాయని అన్నారు. ప్రాణ త్యాగం చేయడం ద్వారా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాడని, శ్రీకాంతాచారికి ఘననివాళి అర్పిస్తున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . 

Also Read: Telangana Elections 2023 : తెలంగాణలో క్యాంప్ రాజకీయాలు తప్పవా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగానే అక్కడికేనట..

తాము పాలకులుగా కాకుండా సేవకులుగా ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ కూడా త్వరలో అమెరికా వెళ్లబోతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబం ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని విమర్శించారు.  అధిష్ఠానం సూచన మేరకు సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios