Asianet News TeluguAsianet News Telugu

Revanth Reddy...రైతుబంధుపై ఈసీకి నకిలీ లేఖ: ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి


రైతుబంధు విషయమై  భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది.  తన పేరుతో  బీఆర్ఎస్ నకిలీ లేఖ సృష్టించిందని  రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  

Revanth Reddy urges to take action for Election Commission against Fake letter on his name over Rythu bandhu lns
Author
First Published Nov 27, 2023, 5:32 PM IST

హైదరాబాద్:  రైతుబంధుపై  తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా  సాగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు.  తన పేరుతో  ఫేక్ లెటర్ తో  బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఈ విషయమై  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి,  రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. 

 

రైతు బంధు అంశంపై  బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. తన పేరుతో  బీఆర్ఎస్ ఫేక్ లేఖ సృష్టించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఈ విషయమై  చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్,  వికాస్ రాజ్,  డీజీపీ అంజనీకుమార్ కు ఫిర్యాదు చేశారు.  రైతుబంధును నిలిపివేయాలని ఈసీ ఇవాళ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

రైతుబంధును నిలిపివేయాలని  ఈసీ  నిర్ణయం తీసుకుంది.గత మాసంలో రైతు బంధు విషయమై  కాంగ్రెస్ నేతలు  ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.  అయితే ఈ విషయమై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు సాగుతున్నాయి. అయితే  రైతుబంధు  కింద మిగిలిన లబ్దిదారులకు  నిధులను విడుదల చేసేందుకు అనుమతివ్వాలని బీఆర్ఎస్ సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 

also read:kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ

ఈ వినతిపై  కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం  సానుకూల నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న రైతుబంధు నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని ఇచ్చింది. ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.  బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయడానికి రైతుబంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  

also read:Barrelakka...కొల్లాపూర్ లో ఇండిపెండెంట్‌గా పోటీ: ఎవరీ బర్రెలక్క?

ఇదిలా ఉంటే రైతుబంధు నిధులను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకుంది. దీనికి కాంగ్రెస్ మళ్లీ ఫిర్యాదు చేయడమే కారణమని  బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. షాద్ నగర్ లో జరిగిన సభలో ఈ విషయమై  కేసీఆర్ కాంగ్రెస్ పై ఆరోపణలు చేశారు. అయితే  ఇదిలా ఉంటే  పీసీసీ అధ్యక్షుడి హోదాలో రైతుబంధును నిలిపివేయాలని ఈసీకి తాను లేఖ రాసినట్టుగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుదని  రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   కేంద్ర ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ విషయమై  రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తన పేరుతో నకిలీ లేఖ సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios