Barrelakka...కొల్లాపూర్ లో ఇండిపెండెంట్‌గా పోటీ: ఎవరీ బర్రెలక్క?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క  అలియాస్ శిరీష పేరు మార్మోగిపోతుంది.  కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి  బర్రెలక్క  ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.  

Barrelakka Contesting From Kollapur Assembly segment,  Who is Barrelakka?

హైదరాబాద్:బర్రెలక్క అలియాస్  శిరీష పేరు  తెలంగాణ ఎన్నికల్లో మీడియాలో  పతాక శీర్షికల్లో మార్మోగిపోతుంది. అనతి కాలంలో  బర్రెలక్క  ప్రాముఖ్యతను సాధించింది. అసలు బర్రెలక్క ఎవరు?  ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన  అనురాధ, శ్రీనివాస్ దంపతుల కూతురు  కర్నె శిరీష.  శిరీష తండ్రి గతంలో  ఫాస్ట్ పుడ్ సెంటర్ నడిపేవాడు.  మూడేళ్ల నుండి అతని ఆరోగ్యం బాగా లేక  కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.  శిరీష అలియాస్ బర్రెలక్క తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుంది.  ఓపెన్ డిగ్రీ పూర్తి చేసింది.  ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు.

 తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడం లేదని  ఓ వీడియో  సోషల్ మీడియాలో  శిరీష పోస్టు చేశారు. తనకు తన తల్లి బర్రెలు ఇప్పించిందని..ఈ బర్రెలు మేపడానికి వచ్చినట్టుగా రెండేళ్ల క్రితం  శిరీష సోషల్ మీడియాలో పోస్టు వైరల్ గా మారింది. దీంతో శిరీష పేరు బర్రెలక్కగా మారింది.ఈ పోస్టుపై శిరీషపై  కేసు కూడ నమోదైంది. శిరీష అలియాస్ బర్రెలక్కకు ఇద్దరు సోదరులు ఉన్నారు.  

పెద్ద తమ్ముడు  డిగ్రీ పూర్తి చేసుకొని హైద్రాబాద్ లో  ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.  శిరీష చిన్న తమ్ముడు డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు.  తల్లి నడిపే ఫాస్ట్ పుడ్ సెంటర్ లో తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ  శిరీష ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంది.డిగ్రీ పూర్తి చేసిన శిరీష  బీఈడీ కూడ పూర్తి చేసింది.  

తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నారు శిరీష. ఈ నిర్ణయంలో భాగంగా  కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

గత వారంలో  పెద్ద కొత్తపల్లిలో  బర్రెలక్క అలియాస్ శిరీష్ ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆమెపై  దాడికి దిగారు.  ఈ విషయమై  బర్రెలక్క  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతను కల్పించాలని కోరారు. బర్రెలక్కకు భద్రతను కల్పించాలని  హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

also read:Barrelakka‌ కు భద్రత కల్పించాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశం

బర్రెలక్క  అలియాస్ శిరీష  చీల్లే ఓట్లు ఏ పార్టీ గెలుపు ఓటములపై ప్రభావం చూపుతాయనే  విషయమై  ప్రస్తుతం అంతా చర్చ సాగుతుంది. బర్రెలక్క చీల్చే ఓట్లు  ఎవరికి సంతోషాన్ని, ఎవరికి దు:ఖాన్ని మిగులుస్తాయో  డిసెంబర్ 3న తేలనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios