Rahul gandhi : బీజేపీ ఎక్కడ చెబితే అక్కడ మజ్లిస్ పోటీ చేస్తుంది - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
Rahul gandhi : బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లు ఒక్కటే అని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ఎక్కడ పోటీ చేయమంటే ఎంఐఎం అభ్యర్థులు అక్కడ పోటీ చేస్తారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు.
Rahul gandhi : బీజేపీ (bjp) ఎక్కడ పోటీ చేయాలని చెబితే అక్కడ ఏఐఎంఐఎం (AIMIM) పోటీ చేస్తుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul gandh) అన్నారు. కాంగ్రెస్ ను గెలవకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎంను బరిలోకి దించుతోందని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాంపల్లి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
కూతురును రేప్ చేసేందుకు ప్రియుడికి పర్మిషన్ ఇచ్చిన తల్లి.. 40 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
ఢిల్లీ (delhi)లోని తన అధికారిక నివాసం నుంచి వెళ్లగొట్టారని, అయినా తాను బాధపడలేదని అన్నారు. తన ఇళ్లు దేశ ప్రజలందరి గుండెల్లోనే ఉందని అన్నారు. అందుకే ఢిల్లీ ఇంటి నుంచి వెంటనే బయటకు వచ్చానని పేర్కొన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ సాకుతో గంటల కొద్దీ తనను కార్యాలయంలో కూర్చోబెట్టారని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ఎంతో చేసిందని అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు (metro rail project), ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు (international airport) తీసుకొచ్చింది తమ ప్రభుత్వమే అని గుర్తు చేశారు.
Nara Lokesh : జగన్ హయాంలో కరెంట్ బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోంది - నారా లోకేష్
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం (BRS, BJP, MIM) మూడు పార్టీలు ఒక్కటే అని రాహుల్ గాంధీ ఆరోపించారు. వారంతా ఒక్కటే అని, కలిసే పని చేస్తారని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ (CM KCR) పై ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwar project) ల్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అందుకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు.