Nara Lokesh : జగన్ హయాంలో కరెంట్ బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోంది - నారా లోకేష్
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కరెంటు బిల్లు పట్టుకోగానే షాక్ కడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 9 సార్లు కరెంటు బిల్లులు పెరిగాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలతో పాటు పన్నుల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
yuva galam : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ పాదయాత్ర సోమవారం నుంచి పున:ప్రారంభమైంది. ఈ యాత్రం మంగళవారం అమలాపురంకు చేరుకుంది.
ఈ పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్న నారా లోకేష్ ను చూసేందుకు అమలాపురం లో టౌన్ లో భారీగా రోడ్లపైకి ప్రజలు చేరుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భావనాల పైకి ఎక్కి ఉన్న ప్రజలకు లోకేష్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న మహిళలు, యువత, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం విధిస్తున్న విద్యుత్ ఛార్జీల బాదుడు తట్టుకోలేకపోతున్నామంటూ లోకేష్ తో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
కూతురును రేప్ చేసేందుకు ప్రియుడికి పర్మిషన్ ఇచ్చిన తల్లి.. 40 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, వీటి వల్ల జీవించడం కష్టంగా మారిందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రభుత్వం సామాన్యుడి పై పెను భారం మోపుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమపై భారం తగ్గించాలని కోరారు.
దారుణం.. నాలుగో తరగతి బాలికను 108 సార్లు జామెట్రీ కంపాస్ తో పొడిచిన తోటి విద్యార్థులు..
దీనికి నారా లోకేష్ స్పందించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయని అన్నారు. కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలపై పన్నుల భారం తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు.