తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చే హామీలను నమ్మొద్దు - కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి
కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు కుమార స్వామి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను నమ్మకూడదని కోరారు. తమ రాష్ట్రంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలేవీ తెలంగాణ ప్రజలు నమ్మకూడదని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ ముఖ్య నాయకుడు కుమారస్వామి అన్నారు. బెంగళూరులోని జేడీఎస్ ఆఫీస్ అయిన జేపీ భవన్‌లో ఆయన ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెడుతోందని, వాటిని ఎవరూ నమ్మకూదని కోరారు.
కాంగ్రెస్ సదన్ పేరును ‘ఆర్ఎస్ఎస్ అన్నా’గా మార్చండి - కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ పై మండిపడ్డ ఓవైసీ
కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని కుమార స్వామి అన్నారు. కానీ ఇక్కడ (కర్ణాటకలో) కాంగ్రెస్ ఇచ్చి 5 గ్యారెంటీలూ ఫెయిల్ అయ్యాయని చెప్పారు. తెలంగాణలో రైతుబంధు పథకం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.
‘‘తెలంగాణలో రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తున్నారు. కాంగ్రెస్ అక్కడికి వెళ్లి ఎకరానికి 15 వేలు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 65 లక్షల హెక్టార్లలో పంటల నష్టం జరిగింది. కానీ రైతులకు నయా పైస పరిహారం ఇవ్వలేదు. ’’ అని ఆరోపించారు. 10 లక్షల కుటుంబాలకు గృహలక్ష్మి పథకం కింద ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని కుమార స్వామి విమర్శించారు.