కోమటిరెడ్డి, పాల్వాయి, చలమల:ఆ గట్టు నుండి ఈ గట్టుకు, ఏడాదిలోనే ఎంత మార్పు

మునుగోడులో ఏడాది కాలంలోనే రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.  గత ఎన్నికల సమయంలో ఓ పార్టీ తరపున అభ్యర్థులు ప్రస్తుతం మరో పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు.  

Palvai sravanthi, chalamala krishna reddy joined BRS and BJP from Congress lns


మునుగోడు: ఏడాది తర్వాత  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  రాజకీయ పరిస్థితులు మారాయి.  గతంలో  ఒకే పార్టీలో ఉన్నవారంతా  పార్టీలు మారారు.తమ అస్తిత్వాన్ని కాపాడుకొనేందుకు పార్టీలు మారారు.   మునుగోడు నియోజకవర్గ ప్రజలు  ఎవరిని  ఆదరిస్తారనే విషయం   మరో నెల రోజుల్లో తేలనుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో  మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. 2022 ఆగస్టు మాసంలో  బీజేపీలో చేరారు. 2022 అక్టోబర్ లో జరిగిన  మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ ఎన్నికల్లో  కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి  బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో  టిక్కెట్టు కోసం చలమల కృష్ణారెడ్డి గట్టిగా  పట్టుబట్టారు. అయితే కాంగ్రెస్ సీనియర్లు పాల్వాయి స్రవంతికి అండగా నిలిచారు. పార్టీ టిక్కెట్టు ఇచ్చినా  పాల్వాయి స్రవంతి ఆ ఎన్నికల్లో విజయం దక్కించుకోలేదు.  ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.  ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి.  బీఆర్ఎస్ గెలుపులో  లెఫ్ట్ పార్టీలు కీలక పాత్ర పోషించాయి.

ఇదిలా ఉంటే  రాష్ట్రంలో  ఈ ఏడాది కాలంలో  రాజకీయ పరిస్థితులు మారాయి. బీజేపీని వీడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే  మునుగోడు కాంగ్రెస్ టిక్కెట్టును ఆశించిన చలమల కృష్ణారెడ్డి అసంతృప్తితో  హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు.  బీజేపీలో చేరారు.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి  బీజేపీ  అభ్యర్థిగా చలమల కృష్ణారెడ్డి బరిలోకి దిగారు.

also read:పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించింది: బీఆర్ఎస్‌లోకి స్రవంతికి ఆహ్వానం పలికిన కేటీఆర్

ఇక కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించిన  పాల్వాయి స్రవంతి కూడ అసంతృప్తితో ఉన్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో  మండల కమిటీల  నియామాకాల్లో  చలమల కృష్ణారెడ్డికే ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ నాయకత్వం.   మునుగోడు టిక్కెట్టు దక్కకపోవడంతో  స్రవంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  
నిన్ననే పాల్వాయి స్రవంతి  కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇవాళ కేటీఆర్ సమక్షంలో  బీఆర్ఎస్ లో చేరారు. పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నియోకవర్గం నుండి పలు దఫాలు విజయం సాధించారు.  పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లేదా సీపీఐ అభ్యర్ధి ఈ నియోజకవర్గం నుండి విజయం సాధించిన రికార్డు ఉంది.

also read:కాంగ్రెస్‌కు పాల్వాయి స్రవంతి షాక్: రాజీనామా, బీఆర్ఎస్ లో చేరిక

గత ఏడాది జరిగిన  అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధిగా  బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగుతున్నారు. ఐదేళ్ల వ్యవధిలో  రెండు దఫాలు కాంగ్రెస్ అభ్యర్ధిగా , ఒక్క సారి బీజేపీ అభ్యర్ధిగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఈ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు.

గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల సమయంలో సీపీఐ,సీపీఎంలు  బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి.ఈ ఎన్నికల సమయంలో సీపీఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ మద్దతుతో  సీపీఐ పోటీ చేస్తుంది.  సీపీఎం మాత్రం ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుంది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి సీపీఎం అభ్యర్థిగా దోనూరి నర్సిరెడ్డి బరిలోకి దిగారు.

ఇదిలా ఉంటే  ఏడాది క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించింది.  2018 ఎన్నికల సమయంలో కూడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి  కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలో రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios