కాంగ్రెస్‌కు పాల్వాయి స్రవంతి షాక్: రాజీనామా, బీఆర్ఎస్ లో చేరిక


మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో  కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  కాంగ్రెస్ కీలక నాయకురాలు పాల్వాయి స్రవంతి  ఆ పార్టీని వీడారు. ఈ నియోజవకర్గం నుండి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి  సుధీర్ఘకాలం పాటు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు.

 Congress leader Palvai sravanthi joins in BRS lns

హైదరాబాద్: కాంగ్రెస్ కు  మాజీ మంత్రి పాల్వాయి  గోవర్ధన్ రెడ్డి  కూతురు  పాల్వాయి స్రవంతి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి  పాల్వాయి స్రవంతి రాజీనామా చేశారు. ఆదివారంనాడు  ఉదయం  తెలంగాణ భవన్ లో  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో  ఆమె భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు.

2022 అక్టోబర్ మాసంలో  జరిగిన  మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి  బరిలోకి దిగారు.ఈ ఎన్నికల్లో  పాల్వాయి స్రవంతి మూడో స్థానంలో నిలిచారు. ఈ దఫా కూడ  మునుగోడు స్థానం నుండి ఆమె టిక్కెట్టును ఆశించారు. పాల్వాయి స్రవంతితో పాటు  చలమల కృష్ణారెడ్డి కూడ  కాంగ్రెస్ టిక్కెట్టును ఆశించారు. 

అయితే  గత నెలలో  బీజేపీకి రాజీనామా చేసి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. దీంతో  పాల్వాయి స్రవంతి ,చలమల కృష్ణారెడ్డిలు అసంతృప్తికి గురయ్యారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించడంతో  అసంతృప్తితో  ఆయన  కాంగ్రెస్ పార్టీని వీడారు. బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన చలమల కృష్ణారెడ్డికి  కమలం పార్టీ టిక్కెట్టు కేటాయించింది. 

అయితే ఇటీవల కాలంలో  కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలను నియమించింది. మండల కమిటీల్లో  తనకు కాకుండా చలమల కృష్ణారెడ్డికి అధిక ప్రాధాన్యత  కేటాయించారని  పాల్వాయి స్రవంతి అసంతృప్తితో ఉంది. తన వర్గీయులతో గాంధీ భవన్ లో ఆందోళన కూడ నిర్వహించారు.  కానీ తన వర్గానికి ప్రాధాన్యత లేదని ఆమె పార్టీ నాయకత్వం తీరుపై మండిపడ్డారు. 

also read:అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య రాళ్ల దాడి, టెన్షన్ : ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలు

ఈ తరుణంలోనే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరడంతో  పాల్వాయి స్రవంతి ఆ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.  మునుగోడు అసెంబ్లీ స్థానంలో గతంలో కాంగ్రెస్ లో  ఉన్న ఇద్దరు  నేతలు  పార్టీని వీడారు. ఒకరు బీజేపీ, మరొకరు బీఆర్ఎస్ లో చేరారు. మునుగోడు అసెంబ్లీ స్థానంలో  పలు దఫాలు  పాల్వాయి స్రవంతి  కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.  పాల్వాయి  స్రవంతి కూడ కాంగ్రెస్ టిక్కెట్టు దక్కని కారణంగా గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios