Asianet News TeluguAsianet News Telugu

D. K. Shiva kumar..బీఆర్ఎస్ , బీజేపీకి ఓటు వేసి వృధా చేసుకోవద్దు:కామారెడ్డిలో డీ. కే. శివకుమార్

కర్ణాటక డిప్యూటీ సీఎం  డీ.కే. శివకుమార్ తెలంగాణలో  ప్రచారం నిర్వహిస్తున్నారు.  కర్ణాటకలో  కాంగ్రెస్  ఇచ్చిన హమీలను అమలు చేస్తున్న విషయాన్ని ఆయన  వివరించారు.

Our government has done as promised: Karnataka Dy CM D.K. Shivakumar lns
Author
First Published Nov 26, 2023, 3:59 PM IST

కామారెడ్డి: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టబోతున్నారని   కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్ ధీమాను వ్యక్తం చేశారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారంనాడు  నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. తెలంగాణలో  అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.   మోడీ, కేసీఆర్ ఇద్దరూ  ఒక్కటేనన్నారు.  

also read:kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ

ఎన్ని అడ్డంకులు ఎదురైనా  సోనియా గాంధీ  తెలంగాణను  ఇచ్చిందన్నారు.  కర్ణాటకలో  తమ ప్రభుత్వం ఐదు  గ్యారంటీలను అమలు చేస్తున్నామని  డీకే శివకుమార్  చెప్పారు.  కేసీఆర్, కేటీఆర్ లకు తాను  సవాల్ విసురుతున్నా ఎవరైనా  కర్ణాటకకు వచ్చి చెక్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని  బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.పార్లమెంట్ లో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు  కేసీఆర్ మద్దతు ఇచ్చారన్నారు.

also read:Narendra Modi..ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ: తూఫ్రాన్ సభలో నరేంద్ర మోడీ

కేసీఆర్ రెండు ఎందుకు స్థానాల్లో పోటీ చేస్తున్నారని ఆయన  ప్రశ్నించారు.గజ్వేల్ లో ఓటమి భయంతోనే  కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఎన్ని హమీలను ఆయన నెరవేర్చారని  డీకే శివకుమార్ ప్రశ్నించారు. దళితులకు సీఎం పదవి ఏమైందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేన్నారు.బీఆర్ఎస్, బీజేపీకి ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దని డీకే శివకుమార్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios