Asianet News TeluguAsianet News Telugu

KTR: కాంగ్రెస్ నేతలకు ఇదీ నా బంపర్ ఆఫర్.. ముస్తాబాద్‌కు వచ్చి.. : కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముస్తాబాద్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలకు బంపరాఫర్ ఇస్తున్నట్టు చెప్పారు. 24 కరెంట్ అందుబాటులో లేదని చెప్పే కాంగ్రెస్ నేతలారా.. ముస్తాబాద్ వచ్చి ఇక్కడ కరెంట్ తీగలు పట్టుకుంటే కరెంట్ ఉన్నదో లేదో తెలుస్తుందని అన్నారు.
 

Minister KTR gives bumper offer to Congress leaders who denies 24 hours electricity supply kms
Author
First Published Nov 21, 2023, 8:52 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుమీదున్నది. ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు కామెంట్లు చేస్తూ వేడి రగుల్చుతున్నారు. తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలకు ఓ బంపరాఫర్ ఇస్తున్నట్టు చెప్పారు.

‘తెలంగాణలో తాము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కానీ, ఇది కాంగ్రెస్ వితండవాదం చేస్తున్నారు. 24 గంటల కరెంట్ కనిపిస్తలేదన్న కాంగ్రెస్ నేతలారా.. మీరంతా ముస్తాబాద్‌కు వచ్చేయండి. ఎప్పుడు వస్తారో చెబితే నేనే బస్సు కూడా ఏర్పాటు చేస్తాను. ఇక్కడికి వచ్చి లైన్‌లో నిలబడి మండలంలోని కరెంట్ వైర్లను గట్టిగా పట్టుకుని చూడండి. అప్పుడు ఆ తీగలకు కరెంట్ ఉన్నదో లేదో మీకు తెలుస్తుంది’ అంటూ కేటీఆర్ అన్నారు. 

Also Read: Unemployment: బీఆర్ఎస్‌కు నిరుద్యోగుల సవాల్.. ఆకట్టుకుంటున్న హస్తం మ్యానిఫెస్టో.. రంగంలోకి కేటీఆర్

‘మీరు ఓటు వేస్తే నేను ఎమ్మెల్యేను అయ్యాను. గౌరవంగా తల ఎత్తుకునేలా పని చేశాను. ఇకపైనా చేస్తాను. మరొకసారి మీకు సేవలు చేసే అవకాశం నాకు కల్పించండి. మరోసారి నన్ను ఆశీర్వదించండి’ అని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు రాగానే వాళ్లు చెప్పేది.. వీళ్లు చెప్పేది విని మోసపోవద్దని, మంచిగా ఆలోచించి తనకే ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios