Longest serving Chief Ministers:అత్యధిక కాలం సీఎంలుగా.. పవన్ కుమార్, నవీన్ పట్నాయక్..జ్యోతిబసు

దేశంలో సుధీర్ఘకాలం పాటు  ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు  పవన్ కుమార్ చావ్లా దక్కించుకున్నారు. 24 ఏళ్ల పాటు సిక్కిం రాష్ట్రానికి ఆయన సీఎంగా పనిచేశారు. 

Longest serving Chief Ministers (CMs) in states of India lns


హైదరాబాద్:దేశంలో పవన్ కుమార్ చావ్లా సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా  పనిచేసిన రికార్డు సృష్టించారు.  24 ఏళ్ల 165 రోజుల పాటు సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా  ఆయన  పనిచేశారు.1994 డిసెంబర్ 12 నుండి 2019 మే 26 వ తేదీ వరకు  సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.  సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ తరపున ఆయన  సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా  పనిచేశారు. ఆ తర్వాతి స్థానంలో  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన సీఎంగా రికార్డు సృష్టించారు. 2000 మార్చి 5 వ తేదీ నుండి  ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా  నవీన్ పట్నాయక్ కొనసాగుతున్నారు.  నవీన్ పట్నాయక్ తండ్రి  బిజూ పట్నాయక్  కూడా గతంలో ఒడిశా సీఎంగా పనిచేశారు.  బిజూ పట్నాయక్ మరణంతో  నవీన్ పట్నాయక్  ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిజూ పట్నాయక్ మరణంతో బిజూ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. అదే పార్టీ ఒడిశాలో  వరుసగా విజయాలు సాధిస్తుంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జ్యోతిబసు  అత్యధిక కాలం పనిచేశారు. దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు తొలుత జ్యోతిబసుపైనే ఉంది. జ్యోతిబసు రికార్డును  పవన్ కుమార్ చావ్లా బ్రేక్ చేశారు.

2000 నవంబర్ 5 వ తేదీ వరకు జ్యోతిబసు బెంగాల్ సీఎంగా పనిచేశారు.  అప్పటి వరకు  పశ్చిమబెంగాల్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బుద్దదేవ్ భట్టాచార్యకు  బెంగాల్  సీఎంగా బాధ్యతలు అప్పగించారు.  జ్యోతిబసు వయోభారం కారణంగా  సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. సీపీఐ(ఎం)  కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోల నిర్ణయం మేరకు బెంగాల్ సీఎం పదవిలో  బుద్దదేవ్ భట్టాచార్యను  నియమించారు. 

పశ్చిమ బెంగాల్ సీఎంగా  జ్యోతిబసు ఉన్న సమయంలోనే  1996లో  ప్రధాన మంత్రి పదవిని  ఆనాడు విపక్షాల కూటమి  ప్రతిపాదించింది. అయితే ఈ విషయమై  ఆనాడు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో లు  ప్రధాన మంత్రి పదవిని తీసుకొనేందుకు నిరాకరించాయి.  అయితే  ప్రధాన మంత్రి పదవి తీసుకోకపోవడం చారిత్రక తప్పిదమని జ్యోతిబసు అప్పట్లో  వ్యాఖ్యలు చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేసిన గెగాంగ్ అపాంగ్  సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.  జ్యోతిబసు తర్వాతి స్థానంలో ఆయన  నిలిచారు.22 సంవత్సరాల ఎనిమిది నెలల ఐదు రోజుల పాటు  ఆయన  సీఎం పదవిలో కొనసాగారు.గెగాంగ్ అపాంగ్ వరుసగా  సీఎం పదవిలో లేరు.  1990 వరకు  సీఎం వరుసగా కొనసాగారు.   1980 జనవరి నుండి 1990 వరకు, 2003 ఆగస్టు నుండి 2007 ఏప్రిల్ వరకు  ఆయన సీఎం పదవిలో కొనసాగారు. 

ఆ తర్వాతి స్థానంలో  లాల్ తన్ హవాలా స్థానంలో నిలిచారు.22 ఏళ్లు 16 నెలల పాటు  మిజోరం సీఎంగా  పనిచేశారు.హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా   21 ఏళ్ల 13 రోజుల పాటు  వీరభద్ర సింగ్ పనిచేశారు. వీరభద్రసింగ్ కూడ   వరుసగా హిమాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేయలేదు.1983 ఏప్రిల్ 8వ తేదీ నుండి 1990 మార్చి 5వ తేదీ వరకు సీఎంగా పని చేశారు. 1993 డిసెంబర్ 1998 మార్చి 24 వ తేదీవరకు  సీఎంగా పనిచేశారు. వీరభద్రసింగ్ తర్వాతి స్థానంలో సీపీఐ(ఎం) నేత మాణిక్ సర్కార్  త్రిపుర ముఖ్యమంత్రిగా సుధీర్ఘ కాలం పనిచేశారు.1998 మార్చి 11 నుండి 2018 మార్చి 9వ తేదీ వరకు  త్రిపుర సీఎంగా వరుసగా  మాణిక్ సర్కార్ పనిచేశారు.  త్రిపుర రాష్ట్రానికి  19 ఏళ్ల 363 రోజుల పాటు ఆయన సీఎంగా పనిచేశారు.త్రిపుర రాష్ట్రానికి సుధీర్ఘకాలం ఆయన  సీఎంగా పనిచేశారు.2018లో త్రిపురలో  బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో  మాణిక్ సర్కార్ సీఎం పదవిని కోల్పోయారు.

ముఖ్యమంత్రి పేరు పదవీ కాలం (ఎన్ని సంవత్సరాలు) రాష్ట్రం
1.పవన్ కుమార్ చావ్లా 24 సంవత్సరాల 165 రోజులు సిక్కిం
2.నవీన్ పట్నాయక్ 23 సంవత్సరాల 271 రోజులు ఒడిశా
3.జ్యోతిబసు 23 సంవత్సరాల 137 రోజులు పశ్చిమ బెంగాల్
4.గెగాంగ్ అపాంగ్ 22 సంవత్సరాల 250 రోజులు అరుణాచల్ ప్రదేశ్
5.లాల్ తన్హావాలా 22 సంవత్సరాల 60 రోజులు మిజోరం
6.వీరభద్రసింగ్ 21 సంవత్సరాల 13 రోజులు హిమాచల్ ప్రదేశ్
7.మాణిక్ సర్కార్ 19 సంవత్సరాల 363 రోజులు త్రిపుర
8.ఎం. కరుణానిధి 18 సంవత్సరాల 362 రోజులు తమిళనాడు
9.ప్రకాష్ సింగ్ బాదల్ 18 సంవత్సరాల 350 రోజులు పంజాబ్

also read:Telangana Election Results..రెండుసార్లు బీఆర్ఎస్‌కే పట్టం: కాంగ్రెస్ పట్టు సాధించేనా?

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుణానిధి 18 ఏళ్ల  362 రోజుల పాటు  పనిచేశారు. అయితే  తమిళనాడుకు కరుణానిధి వరుసగా సీఎంగా పనిచేయలేదు. పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కరుణానిధి తర్వాతి స్థానంలో నిలిచారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios