Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రెండు సార్లు బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ స్పష్టతకు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఆ పార్టీయే తెలంగాణలో అధికారం చేపట్టబోతోందని దాదాపుగా ఖరారు అయ్యింది. ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలని భావించిన బీఆర్ఎస్ ఆశ నెరవేరలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుండగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల్లో నిరాశకు గురయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Karimnagar Election Results 2023 : వెనకబడ్డ బండి సంజయ్.. 10 వేల ఓట్లకు పైగా ముందంజలో గంగుల కమలాకర్

అయితే ఈ ఫలితాలపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. నిన్న సాయంత్రం వరకు ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ధీమాతో ఉన్న ఆయన.. ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 

Scroll to load tweet…

ఈరోజు వచ్చిన ఫలితాలు తమను బాధించలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ నిరాశకు గురి చేశాయని చెప్పారు. ఈ ఫలితాలను ఒక పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన అభినందనలు చెప్పారు. ఆ పార్టీకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. 

Scroll to load tweet…

కొంత సమయం తరువాత చేసిన మరో ట్వీట్ లో కాస్తా హాస్యాన్ని జోడించారు. శనివారం సాయంత్రం ఆయన చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. ఈ సారి మిస్ ఫైర్ అయ్యిందంటూ స్మైలీ ఇమోజీ పెట్టారు. ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని చెబుతూ నిన్న సాయంత్రం ఆయన గన్ తో షూట్ చేస్తున్నట్టు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను తాజాగా రీట్వీట్ చేశారు.