Karimnagar Election Results 2023 : వెనకబడ్డ బండి సంజయ్.. 10 వేల ఓట్లకు పైగా ముందంజలో గంగుల కమలాకర్

Karimnagar Election Results 2023 : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వెనకబడిపోయారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ 10 వేల ఓట్లకు పైగా మెజారిటీ కనబరుస్తున్నారు.

Karimnagar Election Results 2023 : Gangula Kamalkar is ahead with more than 10 thousand votes..ISR

Bandi Sanjay : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల మంత్రులు, ముఖ్య నాయకులు ఓటమి చవిచూస్తుంటే.. ఏళ్ల తరబడి విజయానికి దూరంగా ఉన్న నాయకులు ఈ సారి గెలుపొందుతున్నారు. అయితే కరీంనగర్ ఎంపీ, బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ ఈ ఎన్నికల్లో గెలుపొందుతారని అందరూ భావించారు. కానీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ చేతిలో వెనకబడిపోయారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్ డేట్స్

15 రౌండ్ ముగిసే సమయానికి బండి సంజయ్ పై 10,036 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు కరీంనగర్ లో కౌంటింగ్ మొదలుపెట్టారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అయితే ఇందులో బండి సంజయ్ ఆధిక్యం కనబర్చారు. అనంతరం ఈవీఎంలు ఫలితాలను లెక్కబెట్టారు.

bansuwada Election Results 2023 : బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం.. ఓటమి సంప్రదాయానికి బ్రేక్..

మొదటి రౌండ్ లో గంగుల కమలాకర్ లీడ్ లోకి వచ్చారు. రెండో రౌండ్ లో మళ్లీ బండి సంజయ్ లీడ్ లోకి రాగా.. తరువాత గంగుల వచ్చారు. ఇలా 15వ రౌండ్ ముగిసే సరికి బండి సంజయ్ చాలా వెనకబడిపోయారు. 15 రౌండ్ లో బండిపై గంగుల 10,036 ఓట్ల ఆధిక్యం కనబర్చారు. అయితే తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ఆ బీజేపీ ప్రకటించింది. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ సీఎం అభ్యర్థి అని అందరూ భావించారు. కానీ ఆయన ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios