Nagarjuna Sagar Dam నుండి నీటి విడుదల ఆపాలి: ఆంధ్రప్రదేశ్ కు కేఆర్ఎంబీ లేఖ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ స్పందించింది. ఇవాళ నాగార్జున సాగర్ కు కేఆర్ఎంబీ ప్రతినిధులు వెళ్లారు. కేఆర్ఎంబీ బృందం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు శుక్రవారం నాడు లేఖ రాసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు విడతల్లో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నట్టుగా కేఆర్ఎంబీ తెలిపింది.2024 జనవరి,ఏప్రిల్ లో నీరు విడుదల చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ వివరించింది.నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం సరైంది కాదని కేఆర్ఎంబీ వివరించింది.
also read:Nagarjuna Sagar Dam లో మా వాటా నీటినే వాడుకుంటాం:తెలంగాణ ఎన్నికలపై అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారని తెలంగాణ ఫిర్యాదు చేసినట్టుగా కేఆర్ఎంబీ తెలిపింది. అంతేకాదు నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించారని కూడ ఫిర్యాదు చేసిన విషయాన్ని కేఆర్ఎంబీ వివరించింది. కేఆర్ఎంబీ ఆదేశాలను తుంగలో తొక్కి రాష్ట్రాలు ఇష్టారీతిలో వ్యవహరించవద్దని ఆ లేఖలో కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 29వ తేదీ రాత్రి నాగార్జున సాగర్ డ్యామ్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారు. డ్యామ్ పై ఉన్న 13వ గేట్ నుండి ఏపీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు నీటిని విడుదల చేయకుండా ఉండేలా తెలంగాణ నీటి పారుదల శాఖాధికారులు విద్యుత్ ను కూడ నిలిపివేశారు. అయితే ప్రత్యేకంగా విద్యుత్ ఏర్పాటు చేసుకొని కుడి కాల్వకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేశారు.
also read:Nagarjuna Sagar Dam:ఆంధ్రా పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై నాగార్జున సాగర్‌లో కేసు
నాగార్జునసాగర్ డ్యామ్ పై సీసీటీవీ పుటేజీని కూడ ధ్వంసం చేశాయని తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆరోపించింది. ఈ విషయమై తెలంగాణ పోలీసులు నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరో వైపు నాగార్జున సాగర్ డ్యామ్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నీటి పారుదల శాఖాధికారులు నీటి విడుదల చేయడంపై తెలంగాణ నీటి పారుదల శాఖాధికారులు కూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.