Nagarjuna Sagar Dam:ఆంధ్రా పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై నాగార్జున సాగర్‌లో కేసు

నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీస్, ఇరిగేషన్ అధికారులపై  కేసులు నమోదయ్యాయి. తెలంగాణకు చెందిన అధికారుల ఫిర్యాదు మేరకు  ఈ కేసులు నమోదు చేశారు.

 Cases filed Against  Andhra Pradesh Police and Irrigation officials in Nagarjuna sagar lns


నల్గొండ: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై   ఆంధ్రప్రదేశ్ పోలీసులపై  నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో  శుక్రవారంనాడు  కేసు నమోదైంది. నాగార్జునసాగర్  డ్యామ్ పై సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులపై  కూడ నాగార్జునసాగర్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా నాగార్జునసాగర్ డ్యామ్ పైకి వచ్చారని  తెలంగాణ అధికారులు  నాగార్జునసాగర్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.   అనుమతి లేకుండానే  నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేశారని ఫిర్యాదు చేశారు.

also read:Revanth Reddy..వ్యూహత్మకంగానే తెరపైకి నాగార్జున సాగర్ వివాదం : రేవంత్ రెడ్డి

ఈ నెల  29వ తేదీన రాత్రి ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసులు నాగార్జునసాగర్ డ్యామ్ పైకి వచ్చి  13వ గేట్ నుండి  బారికేడ్లు ఏర్పాటు చేశారు.ఈ విషయమై  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. డ్యామ్ పై బారికేడ్లు ఏర్పాటు చేసి  13వ గేట్ నుండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  ఈ విషయాన్ని తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ  డ్యామ్ వద్దకు వెళ్లి ఏపీ పోలీసులతో మాట్లాడారు. కానీ ఏపీ పోలీసులు వెనక్కి వెళ్లేందుకు అంగీకరించలేదు.  డ్యామ్ పై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను  కూడ ధ్వంసం చేశారు.  నాగార్జున సాగర్ డ్యామ్ నుండి  కుడి కాల్వకు నీటిని విడుదల చేశారు. 

ఈ విషయమై  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు  తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  ఇవాళ  కేఆర్ఎంబీ అధికారులు  నాగార్జునసాగర్ డ్యామ్ వద్దకు వెళ్లారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులతో  కేఆర్ఎంబీ అధికారులు చర్చిస్తున్నారు.నాగార్జునసాగర్ నుండి నీటి విడుదల విషయమై తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య  గతంలో కూడ వివాదాలు జరిగాయి.

also read:Nagarjuna Sagar పై రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయవద్దు: వికాస్ రాజ్

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  2015లో కూడ  నాగార్జునసాగర్ డ్యామ్ పై   రెండు రాష్ట్రాల పోలీసులు ఘర్షణ పడ్డారు.ఈ విషయమై అప్పటి గవర్నర్  నరసింహన్  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు.  రాజ్ భవన్ లో రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు సమావేశమయ్యారు.  దీంతో  ఆ గొడవ అప్పట్లో సద్దుమణిగింది.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios