Khammam Election Result 2023: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు.. తుమ్మల గెలుపు
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బరిలో నిలిచారు. ప్రధానంగా వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది.
ఖమ్మం: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.49,381 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగారు.ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ 112. ఈ నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది.
also read:Nalgonda Election Results 2023: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు
ఖమ్మం అసెంబ్లీ స్థానంలో 11.05 శాతం ఎస్‌సీ జనాభా ఉంది. ఎస్ టీ జనాభా 9.8 శాతం ఉంటుంది. జిల్లా అక్షరాస్యత 65.95 శాతం ఉంది.ఖమ్మం అసెంబ్లీ స్థానంలో 3,15,726 ఓటర్లున్నారు. ఇందులో 1,64,006 మంది పురుష ఓటర్లున్నారు. 1,64,006 మహిళా ఓటర్లున్నారు. 47 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కును కలిగి ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2,74, 017 మంది ఓటర్లున్నారు.
also read:Telangana Assembly Election Results 2023 LIVE : కేసీఆర్ తో సహా ఆరుగురు మంత్రులు వెనుకంజ...
2018 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పువ్వాడ అజయ్ కుమార్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10.991 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ 49.78 శాతం ఓట్లు దక్కించుకున్నారు.ఈ ఎన్నికల్లో ఖమ్మం నుండి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు.ప్రస్తుతం ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.