Asianet News TeluguAsianet News Telugu

Telangana Elections: 26న జనసేనాని ప్రచారం.. కూకట్‌పల్లిలో బహిరంగ సభలో ప్రసంగం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూకట్‌పల్లిలో 26వ తేదీన ప్రచారం చేస్తారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అమిత్ షాతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
 

janasena chief pawan kalyan to campaign in kukatpalli on 26th telangana assembly elections kms
Author
First Published Nov 18, 2023, 10:48 PM IST | Last Updated Nov 18, 2023, 10:48 PM IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ పై అనేక సంశయాలు ఇన్ని రోజులు ఉన్నాయి. తాజాగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సస్పెన్స్‌కు తెర దించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీన తెలంగాణలో ప్రచారం చేస్తారని వెల్లడించారు. కూకట్‌పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతారని వివరించారు. క్యాంపెయిన్‌లో కేంద్రహోం మంత్రి అమిత్ షాతోపాటుగా పాల్గొనబోతున్నారు.

కూకట్‌పల్లిలో జనసేన ఐటీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి నాదెండ్ల మనోహర్ హాజరై కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చారు. తాము శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్ల కోసం ప్రయత్నించామని, కానీ, చివరకు శేరిలింగం పల్లి సీటును పొత్తులో భాగంగా బీజేపీకి వదిలిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

Also Read: Barrelakka: బర్రెలక్కకు బంపర్ ఆఫర్.. ప్రచార ఖర్చులకు లక్ష రూపాయల విరాళం

హైదరాబాద్ మహానగరంగా ఎదగడానికి అందరమూ తోడ్పడ్డామని మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్ర నుంచి ఎందరో ఇక్కడికి వచ్చి పని చేసి సంపాదించుకున్నారని, ఆ డబ్బును ఇక్కడే పెట్టుబడులు పెట్టి నగర అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు దేశంలో ఎవరూ లేరని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios