Barrelakka: బర్రెలక్కకు బంపర్ ఆఫర్.. ప్రచార ఖర్చులకు లక్ష రూపాయల విరాళం

బర్రెలక్క శిరీషకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఆమె క్యాంపెయిన్ ఖర్చుల కోసం మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి శిరీష బరిలో నిలబడిన సంగతి తెలిసిందే.
 

kollapur independent candidate barrelakka shirisha gets rs 1 lakh donation for campaign in telangana elections kms

హైదరాబాద్: శిరీష చేసిన ఓ వీడియో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిగ్రీ చేసినా ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ చేసుకోవడం లేదు కాబట్టి, బర్రెలు కాస్తున్నానని, ఇంకొన్ని బర్రెలు కొనుక్కుని ఈ పని చేస్తానని ఆమె చెప్పిన వీడియో చాలా ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఆమె బర్రెలక్కగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ నిలబడింది. ఆమె తన ప్రచారం కోసం ఓ పాట కూడా విడుదల చేసుకుంది. ఆ పాట కూడా పాపులర్ అవుతున్నది. తాజాగా, ఆమెకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. బర్రెలక్క ప్రచార ఖర్చుల కోసం యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు.

ఈ మేరకు శిరీషతో మల్లాడి కృష్ణారావు మాట్లాడారు. ఆమె అసెంబ్లీ బరిలో నిలబడినందుకు అభినందనలు తెలిపారు. అంతేకాదు, కొల్లాపూర్ నియోజకవర్గ ఓటరు మహాశయులారా.. బర్రెలక్క శిరీష పేద కుటుంబం నుంచి వచ్చిందని వివరించారు. ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.

శిరీష లాంటి ప్రశ్నించే వాళ్లు ముందుకు వచ్చారని, శిరీష వంటి వారు ముందుకు వస్తే ప్రజల భవిష్యత్తు మారుతుందని మల్లాడి కృష్ణారావు చెప్పారు. శిరీష గెలుపును తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. శిరీష ప్రచార ఖర్చుల కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టూ వెల్లడించారు. 

Also Read: రోడ్డు బాగాలేదని అంబులెన్స్ నిరాకరణ.. మంచంపై హాస్పిటల్‌కు తీసుకెళ్లుతుండగా మహిళ మృతి

ఒక వేళ ఈ అసెంబ్లీ బరిలో పరాజయం పాలైనా అధైర్యపడవద్దని, కృంగిపోవద్దని శిరీషకు ఆమె సూచించారు. శిరీష ఉన్నత చదువులు చదువుకుంటే ఆర్థిక సహాయం అందిస్తాననీ హామీ ఇచ్చారు.

ఇప్పటికే బర్రెలక్కకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. చాలా మంది యువత, ముఖ్యంగా నిరుద్యోగులు శిరీష వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమె ప్రచారంలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా యువతలో బర్రెలక్క శిరీషకు క్రేజ్ ఉన్నది. ఈ క్రేజ్ ఓట్లను రాలుస్తుందా? వేచి చూడాల్సిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios