Asianet News TeluguAsianet News Telugu

Pawan Kalyan:జనసేన ఏర్పాటుకు నల్గొండే కారణం

తెలంగాణలో రెండు రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.  బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున ఆయన  ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీసీ సీఎం కావాలంటే బీజేపీ,జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

jana sena chief  Pawan kalyan revealed reasons behind Jana sena party foundation lns
Author
First Published Nov 23, 2023, 3:32 PM IST

సూర్యాపేట: జనసేన పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం నల్గొండ జిల్లా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. గురువారంనాడు  సూర్యాపేటలో  భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి  సంకినేని వెంకటేశ్వరరావుకు మద్దతుగా  నిర్వహించిన  ఎన్నికల ప్రచార సభలో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 

నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య చూసి చలించిపోయిన విషయాన్ని  ఆయన గుర్తు చేసుకున్నారు.ఫ్లోరోసిస్ బాధితులకు మంచినీరు అందించకపోవడం తనకు బాధ అనిపించిందని పవన్ కళ్యాణ్  చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం జరిగిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.తెలంగాణలో బీసీ అభ్యర్ధిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిందన్నారు. 

తమ్ముడు సినిమా ఘన విజయం సాధించిన తర్వాత  ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల్లో  మంచినీటి సరఫరా విషయంలో స్థానిక రాజకీయ నేతలు అడ్డుపడడంతో  రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై అప్పుడే అంకురార్పణ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

2009లో తాను  నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ పీడిత గ్రామాల్లో పర్యటించినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణలో అత్యధికంగా  బీసీ కులాలున్నాయన్నారు. బీసీ కులాలు  రాజ్యాధికారాన్ని సాధించాల్సిన  అవసరం ఉందని  పవన్ కళ్యాణ్ చెప్పారు.ప్రజా యుద్ధనౌక గద్దర్ అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆసుపత్రిలో పరామర్శించి తెలంగాణ యువత గురించి చర్చించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

also read:kalwakurthy ఓటర్ల విలక్షణ తీర్పు: ఎన్‌టీఆర్ ఓటమి,మూడుసార్లు ఇండిపెండెంట్లకు పట్టం

రాజకీయం చాలా గొప్ప కార్యక్రమమని ఆయన  చెప్పారు. యువత, మహిళలు, పీడిత, మైనార్టీ పక్షాల నిలబడాలని  గద్దర్ తనకు  సూచించారన్నారు. గద్దర్ స్ఫూర్తితో తాను  రాజకీయాల్లో కొనసాగుతున్నట్టుగా పవన్ కళ్యాణ్  చెప్పారు.గద్దర్ స్పూర్తే జనసేనను నడిపిస్తుందని  పవన్ కళ్యాణ్ తెలిపారు.సనాతన ధర్మం, సోషలిజం రెండూ పక్క పక్కన నడవొచ్చని  తెలంగాణ ఉద్యమకారులు చెప్పారన్నారు. 

also read:Pawan Kalyan...స్నేహం, రాజకీయాలు వేరు: కేసీఆర్, రేవంత్ రెడ్డితో స్నేహంపై పవన్

ఎరుపు జెండా విప్లవానికి గుర్తు.. కాషాయం సనాతన ధర్మానికి చిహ్నమని పవన్ కళ్యాణ్ తెలిపారు.  మోడీ నేతృత్వంలో  కేంద్ర ప్రభుత్వం  అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని  పవన్ కళ్యాణ్  చెప్పారు.తెలంగాణ యువత దగా పడిందన్నారు. వారికి జనసేన అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.ఆంధ్రలో ఉన్న రాజకీయ పరిస్థితులను నిలబడడానికి  తెలంగాణ పోరాట స్ఫూర్తే కారణమన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios