సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో  రెండో రోజూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో  జనసేనానని  ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. 


కొత్తగూడెం:గత ప్రభుత్వం చేసిన తప్పులను  కేసీఆర్ సర్కార్ కూడ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  విమర్శించారు.  కొత్తగూడెంలో  గురువారంనాడు నిర్వహించిన  ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

గ్రేటర్ హైద్రాబాద్ లో మాత్రమే భూముల ధరలు పెరిగాయన్నారు. ఇతర జిల్లాల్లో పరిస్థితి లేదన్నారు. ధరణి విఫలమైందని ప్రభుత్వం  ఒప్పుకుందన్నారు.ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమౌతుందన్నారు.  గ్రేటర్ హైద్రాబాద్ లో ఎకరం భూమి వందల కోట్లు దాటిన విషయాన్ని  పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.  కానీ, ఇతర జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొందా అని ఆయన  ప్రశ్నించారు. 

తెలంగాణలోని అన్ని పార్టీల నేతలతో తనకు  పరిచయాలున్నాయన్నారు.  కేసీఆర్, రేవంత్ రెడ్డితో తనకు పరిచయాలున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్నేహం వేరు, రాజకీయాలు వేరన్నారు.  తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని సీఎం చేస్తానని  బీజేపీ ప్రకటించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అందుకే  తాను  బీజేపీతో పొత్తు పెట్టుకున్నవిషయాన్ని పవన్ కళ్యాణ్  చెప్పారు.   తెలంగాణ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడితే  అభివృద్ధి సాగుతుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే  రాష్ట్రాలు బాగుపడతాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి రోజూ ఎన్నికల మాదిరిగానే పరిస్థితులు తయారౌతున్నాయని  పవన్ కళ్యాణ్ చెప్పారు.

 

తన ఇజం హ్యుమనిజమని పవన్ కళ్యాణ్ వివరించారు.భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు.నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని  పవన్ కళ్యాణ్ చెప్పారు.నీళ్లు, నిధులు,నియామకాల కోసం భారత రాష్ట్ర సమితి,  కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల, వామపక్షాలు కష్టపడ్డాయని ఆయన గుర్తు చేశాయి.

తెలంగాణ కోసం  1200  మంది బలిదానాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితో ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని ఆయన  చెప్పారు.  అవినీతికి వ్యతిరేకంగా  పోరాటం చేయాలన్న యువతకు  జనసేన అండగా నిలబడుతుందన్నారు.

 ఏపీలో మాదిరిగా తాను తెలంగాణలో తిరగలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే బీఆర్ఎస్ ను  తిట్టడం లేదన్నారు.కౌలు రైతుల్ని చులకగా చూడవద్దని ఆయన పాలకులను కోరారు.   

also read:Pawan Kalyan: తెలంగాణ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో రౌడీలతో పోరాటం

పేపర్ లీకులతో  నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.ఉద్యోగాల కోసం  ప్రిపేరైన  అభ్యర్థులకు పేపర్ లీకులతో తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.నల్లమల అటవీ ప్రాంతంలో  యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ గతంలో తన వద్దకు వచ్చిన 16 ఏళ్ల యువకుడి ఉదంతాన్ని  పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.