Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ 60 సీట్లు గెలుచుకుంటుందా? చరిత్రలో ఇన్ని సీట్లు ఎప్పుడైనా గెలిచిందా?

తెలంగాణ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తామనే ధీమాతో ప్రచారం చేస్తున్నది. అయితే.. ఇది వరకు 60 స్థానాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో గెలుచుకుందా? గత 30 ఏళ్ల చరిత్రలో 60 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోలేదు. 1989లో అత్యధికంగా 59 సీట్లను మాత్రమే సాధించుకుంది.
 

Is congress win telangana elections, when it gained 60 seats kms

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మూడో సార్వత్రిక ఎన్నికలు ఇవి. 2014, 2018 తర్వాత ఇప్పుడ 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అన్ని క్రెడిట్లను సొంతం చేసుకుని రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేసుకోలేకపోయింది. అయితే.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ అని బలంగా చెప్పుకుంటూ కర్ణాటక మోడల్‌ను తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్‌లో టీ కాంగ్రెస్ అనుసరిస్తున్నది. ఆరు గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తప్పకుండా మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా ప్రకటిస్తున్నది. 

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ ఎన్నికల స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తప్పనిసరిగా కనీసం 60 సీట్లు గెలుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ 60 సీట్లు ఈ సారి గెలుచుకోగలుగుతుందా? గతంలో ఇది వరకు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో సీట్లను సాధించిందా? తెలంగాణలో రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లకే పరిమితమైంది. 2014లో 22 సీట్లకు, 2018లో 19 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇది తెలంగాణ ఎపిసోడ్.. అదే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో హస్తం పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో చూద్దాం.

Also Read: Khammam: భర్తను వదిలి పరాయి పురుషుడితో సంబంధం.. ముగ్గురం కలిసుందామని భర్తకే కండీషన్ పెట్టిన భార్య

తెలంగాణ ఏర్పాటుకు ముందు 2009, అంతకు ముందు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2004లో కాంగ్రెస్ పార్టీ 185 స్థానాలు గెలుచుకోగా.. అందులో తెలంగాణ నుంచి వచ్చినవి 48 సీట్లు. 2009లో 156 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగా.. అందులో తెలంగాణ ఏరియా నుంచి గెలిచిన సీట్లు 49 సీట్లు మాత్రమే. అంతకు ముందు రెండు పర్యాయాలు 1999, 1994లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయాల్లోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి 1999లో 42 సీట్లు, 1994లో ఇంకా దారుణమైన ఫలితాలను పొందింది.

ఇంకా వెనక్కి వెళ్లితే 1989లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 181 స్థానాలను కైవసం చేసుకోగా.. అందులో తెలంగాణ ప్రాంతం నుంచి 59 సీట్లు గెలుచుకుంది. అంటే అప్పటి (1989) నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో అధికంగా సీట్ల సంఖ్య 59. అయితే.. అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు.. ఇప్పటి రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పటి కాంగ్రెస్ వ్యూహం కూడా సరికొత్తది. మరి మెజార్టీ మార్క్‌ను కాంగ్రెస్ సాధిస్తుందా? లేదా? అనేది తెలుసుకోవడానికి డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios