Asianet News TeluguAsianet News Telugu

Khammam: భర్తను వదిలి పరాయి పురుషుడితో సంబంధం.. ముగ్గురం కలిసుందామని భర్తకే కండీషన్ పెట్టిన భార్య

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదేమిటని నిలదీసిన భర్తనూ వారితోనే కలిసి ఉండాలని షరతు పెట్టింది. దీంత మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
 

crime news in telangana wife extramarital affair husband suicides in khammam dist mudigonda kms
Author
First Published Nov 20, 2023, 3:17 PM IST | Last Updated Nov 20, 2023, 3:17 PM IST

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో విస్మయకర ఘటన వెలుగులోకి వచ్చింది. సమాజం తలదించుకునేలా భార్య షరతు పెట్టింది. వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. వారితోనే భర్తనూ కలిసుండాలని ఆమె డిమాండ్ చేసింది. భరించలేని భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం(Khammam) జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

బాణాపురం గ్రామానికి చెందిన గుండాల వంశీకి 29 ఏళ్లు. ఆయన ఐదేళ్ల క్రితం ముదిగొండ మండలంలోని గోకినేపల్లికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురానికి సాక్షిగా పండంటి కొడుకు పుట్టాడు. సుఖ సంతోషాలతో సాగిపోవాల్సిన ఆ కాపురం అనుకోని మలుపు తిరిగింది. భర్య తప్పటడుగు వేసింది. పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాదు, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితోనే ఆమె జీవించి ఉంటున్నది.

భార్య వ్యవహారాన్ని భర్త తీవ్రంగా ఖండించాడు. ఆమెను మందలించాడు. అతనితో సంబంధాన్ని వదిలిపెట్టుకోవాలని హెచ్చరించాడు. కానీ, ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టేసింది. ప్రియుడిని వదిలి రానేనని మొండికేసింది. అంతేకాదు, భర్తను కూడా వారితోనే కలిసి ఉండాలని ఎదురుగా షరతు పెట్టింది. దీంతో వంశీ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

Also Read : ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదం : పోలీసులు అదుపులో అనుమానిత యూట్యూబర్...

భార్య గురించి, కొడుకు గురించి ఆలోచిస్తూ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నాడు. భార్య వ్యవహారంతో కలచిపోయిన వంశీ శనివారం తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్య వీడియోను వాట్సాప్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆదివారం ఈ విషయం బయటకు వచ్చింది. 

వంశీ కుటుంబం తీవ్ర ఆవేదనకు లోనైంది. తండ్రి గుండాల శివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుండాల శివయ్య ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ముదిగొండ ఎస్ఐ నరేశ్ వెల్లడించారు. ఈ ఘటన పై స్థానికంగా కలకలం రేగింది. ఆ గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios