Asianet News TeluguAsianet News Telugu

Ibrahimpatnam Election Result 2023 LIVE : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా మల్ రెడ్డి రంగారెడ్డి ఘన విజయం

Ibrahimpatnam Election Result 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగింది. అయితే ఈ సారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలు తమ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు.    
 

Ibrahimpatnam Election Result 2023 LIVE In Ibrahimpatnam Constituency, Congress Candidate MALREDDY RANGA REDDY
Author
First Published Dec 3, 2023, 1:23 PM IST

Ibrahimpatnam Election Result 2023: ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో కాంగ్రెస్ నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీజేపీ నుంచి నోముల దయానంద్ పోటీలో ఉన్నారు. కాగా ఇబ్రహీంపట్నం నియోజక వర్గం ప్రజలు ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి రంగారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారు. దీంతో మల్ రెడ్డి రంగారెడ్డి ఈ విజయాన్ని ఇబ్రహీంపట్నం ప్రజలకు అంకితం చేస్తున్నట్టు వెల్లడించారు. 1,26,506 మొత్తం ఓట్లలో 36,700 ఓట్ల మెజార్టీతో మల్ రెడ్డి రంగారెడ్డి గెలిచారు.

కాగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 3,10,686 మంది ఓటర్లు ఉన్నారు. కాగా మొత్తం ఓటర్లలో 1,57,740 మంది పురుషులు ఉన్నారు.  1,52,917 మంది మహిళలు ఉండగా 29 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,57,711 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1,31,955 మంది పురుషులు ఉండగా 1,25,733 మంది మహిళలు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 30 మంది ఉన్నారు. 

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఎస్ పి అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డిపై 376 ఓట్లతో గెలిచాడు. 2018లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు 36.87 శాతం ఓట్లు వచ్చాయి.కానీ ఈ సారి ఇబ్రహీంపట్నం ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థినే తమ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 
తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

Follow Us:
Download App:
  • android
  • ios