Harish Rao: హరీశ్ రావుకు నా మీద కంటే సిద్దిపేటపైనే ఎక్కువ ప్రేమ: ప్రచారంలో మంత్రి భార్య శ్రీనిత

హరీశ్ రావు గురించి ఆయన భార్య శ్రీనిత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు తనపై కంటే, సంతానంపై కంటే కూడా సిద్దిపేట పైనే ప్రేమ ఎక్కువని వివరించారు. సిద్దిపేటలో క్యాంపెయిన్‌లో పాల్గొన్న శ్రీనిత రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
 

he love siddipet more than me says minister harish rao wife srinitha rao in campaign in siddipet kms

సిద్దిపేట: మంత్రి హరీశ్ రావు భార్య శ్రీనిత రావు సిద్దిపేటలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. హరీశ్ రావు రాష్ట్రస్థాయి పర్యటనల్లో బిజీగా ఉన్నారు. ఇతర అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయడానికి బిజీ బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో సిద్దిపేట బీఆర్ఎస్ క్యాడర్ క్యాంపెయిన్ బాధ్యతలు చేపట్టింది. మంత్రి హరీశ్ రావు కోసం క్యాడర్ ప్రచారం చేస్తున్నది. తాజాగా, ఈ ప్రచారంలో హరీశ్ రావు భార్య శ్రీనిత కూడా పాల్గొన్నారు.

సిద్ధిపేటలో ఆమె ప్రచారం చేస్తూ హరీశ్ రావు గురించి కీలక విషయాలు తెలిపారు. ‘ఆయనకు నాపై కంటే, మా ఇద్దరి పిల్లల మీద కంటే కూడా సిద్దిపేట మీదనే ఎక్కువ ప్రేమ’ అని అన్నారు. సిద్దిపేట ప్రజల నుంచి తాను చిక్కటి అనుబంధాన్ని, ప్రేమను పొందానని వివరించారు. హరీశ్ రావు గురించి మాట్లాడుతూ.. వేరే దేశాల్లోని వినూత్న ఆలోచనలను వెంటనే గుర్తుపట్టడంలో హరీశ్ రావు దిట్ట అని చెప్పారు. అలాంటి మంచి ఆలోచనలను సిద్దిపేటలో అమలు చేస్తారని వివరించారు.

Also Read: Rythu Bandhu: రైతు బంధుపై బీఆర్ఎస్‌లో భిన్నస్వరం.. కాంగ్రెస్ తప్పేమీ లేదన్న ఎంపీ కేశవరావు

మాల్దీవుల్లో ఓ గెస్ట్ హౌజ్‌ను చూసిన హరీశ్ రావు.. రంగనాయక సాగర్ గెస్టు హౌజ్‌ను అదే రీతిలో అభివృద్ధి చేశారని శ్రీనిత రావు తెలిపారు. సిద్దిపేటలోని కోమటిచెరువు వద్ద జురాసిక్ పార్క్ ఐడియాను కొడుకు కోసం అమెరికా వెళ్లినప్పుడు అక్కడ చూసినాక కలిగిందేనని వివరించారు. ఈ సారి తన భర్త 1.50 లక్షల మెజార్టీతో గెలువాలని ఆశపడుతున్నట్టు తెలిపారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావు 1.18 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ఆరుసార్లు గెలిచారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios