బీఆర్ఎస్ ఓటమిపై స్పోర్టివ్ స్పిరిట్‌తో కేటీఆర్  చేసిన కామెంట్ పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. తాను ఇలాంటి రాజకీయ నేతను చూడలేదని తెలిపారు. ప్రజాస్వామ్యానికి కావాల్సిందిదే సర్ అంటూ స్పందించారు. 

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో మెజార్టీ మార్క్‌ను దాటేసింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ గెలుపుపై ధీమాగా ఉన్న కేటీఆర్ ఈ రోజు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓటమిని ఆయన స్పోర్టివ్‌గా తీసుకున్నారు. ఈ ట్వీట్ పై ఆర్జీవీ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బీఆర్ఎస్‌కు రెండు సార్లు విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ రోజు ఫలితాల గురించి బాధపడటం లేదని, కానీ, నిరాశ పడ్డానని వివరించారు. వీటిని గుణపాఠంగా తీసుకుంటామని, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

అంతకు ముందు ఓ గన్ షూట్ ఫొటోను పోస్టు చేసి ఇది సరిగా పోలేదని, లక్ష్యాన్ని మిస్ అయిందని కేటీఆర్ కామెంట్ చేశారు.

Also Read : Kothagudem Election Results 2023:తెలంగాణ అసెంబ్లీలో మరోసారి కమ్యూనిస్టు ఎమ్మెల్యే

ఈ కామెంట్ పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నిజానికి ఇది చాలా బాగా వెళ్లిందని వివరించారు. ఎందుకంటే తాను ఇది వరకు పరాజయాన్ని ఇంతటి స్పోర్టివ్ స్పిరిట్‌తో తీసుకున్న రాజకీయ నాయకుడిని చూడలేదని తెలిపారు. కుదోస్ టు యూ అని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి కావాల్సిందిదే అని కామెంట్ చేశారు.