Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 2,290 మంది భవితవ్యం తేల్చనున్న 3.26 కోట్ల ఓటర్లు..

telangana election poll 2023 : తెలంగాణలో ప్రచార మైకులన్నీ మూగబోయాయి. మరి కొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి అసెంబ్లీ బరిలో 2,290 మంది నిలబడ్డారు. 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

Everything is ready for the Telangana assembly elections- 2023.. 2,290 3.26 crore voters will decide their fate..ISR
Author
First Published Nov 29, 2023, 3:48 PM IST

telangana assembly elections 2023 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (telangana assembly elections 2023) సమరానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. దాదాపు నెలన్నర రోజులుగా కొనసాగిన ప్రచార హోరు మంగళవారంతో ముగిసిపోయింది. నిన్నటి నుంచి మైకులన్నీ మూగబోయాయి. పోలింగ్ కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థులతో టెన్షన్ మొదలైంది. 

digital payment frauds: డిజిటల్ లావాదేవీల మోసాలపై కేంద్రం ఉక్కుపాదం.. 70 లక్షల మొబైల్ నెంబర్లు సస్పెండ్..

తెలంగాణ శాసనసభకు 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు జరిగే పోలింగ్ కోసం రంగం సిద్ధమైంది. దీని కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 

election rules : ఓటు వేయడానికి వెళ్లేముందు ఇవన్నీ ఉన్నాయో లేదో.. చెక్ చేసుకోండి...

106 నియోజకవర్గాల్లో ఇదే సమయంలో ఓటింగ్ కొనసాగనుండగా.. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కలిసి  2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని రేపు తేల్చనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మరి దేవాలయాల్లో హారతి సంగతేంటి ? : మసీదులో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలన్న పిటిషన్ పై హైకోర్టు వ్యాఖ్యలు..

కాగా.. ఈ ఎన్నికల విధుల్లో 2.5 లక్షల మంది సిబ్బంది పాల్గొననున్నారు.  ఈసారి తొలిసారిగా తెలంగాణలో దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నవంబర్ 30న ఐటీ సంస్థలతో సహా అన్ని ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 9న ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు రాష్ట్రంలో సుమారు రూ.737 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఉచితాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana Elections 2023: తొలిసారి ఓటు వేస్తున్నారా? అయితే ఈ విష‌యాలు మీరు తెలుసుకోవాల్సిందే.. !

ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 119 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే తెలంగాణలో ఈ సారి బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 118 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం నగరంలోని తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios