Asianet News TeluguAsianet News Telugu

election rules : ఓటు వేయడానికి వెళ్లేముందు ఇవన్నీ ఉన్నాయో లేదో.. చెక్ చేసుకోండి...

ఓటు వేయడానికి  వెళ్లేముందు ఈ జాగ్రత్తలు తీసుకున్నారా? అవసరమైన గుర్తింపు కార్డులన్ని మీ దగ్గర ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి.  అవేంటంటే…

Election rules : Before going to vote, check all these - bsb
Author
First Published Nov 29, 2023, 1:30 PM IST

హైదరాబాద్ :  తెలంగాణలో  గురువారం నాడు పోలింగ్  జరగనుంది.  ఇప్పటికే పోలింగ్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం  పోలింగ్ నాడు సెలవు ప్రకటించింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా, ఇబ్బందులు లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యేలా  రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అయితే, ఎన్నిసార్లు ఓటు వేసినా.. వేయడానికి వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తమతో ఏమేం తీసుకువెళ్లాలి అనే విషయంలో.. కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.

గుర్తింపు కార్డు
ఓటు వేయడానికి తప్పనిసరిగా ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు ఉండాలి.  ఇలాంటిది లేకపోతే ఎన్నికల అధికారులు ఓటు వేయడానికి అనుమతించరు. ఇంటింటికి పంపిణీ చేసిన ఫోటోతో కూడిన ఓటరు చీటీ ఉన్నా కూడా గుర్తింపు కార్డు తప్పనిసరి. ఆ స్లిప్పు కేవలం పోలింగ్ కేంద్రం,  ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్య ఈజీగా గుర్తించడానికి మాత్రమే. ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్కటైనా మీ వెంట తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. ఒకవేళ ప్రత్యేక వైకల్యం కలిగిన దివ్యాంగులైతే.. కేంద్ర న్యాయ సాధికారిక మంత్రిత్వ శాఖ జారీ చేసే  యూనిట్ డిజిటల్ గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది.

ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులు ఇవే
- ఓటరు ఫోటో గుర్తింపు కార్డు
- ఆధార్ కార్డు
- ఉపాధి హామీ జాబ్ కార్డ్
- ఫోటోతో ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బుక్
- డ్రైవింగ్ లైసెన్స్
- పాన్ కార్డ్
- కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసే ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డ్
- ఎన్ పి ఆర్ కింద ఆర్ జిఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్
- భారతీయ పాస్పోర్ట్
- మీ ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు
- ఎంపీ, ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీలకు జారీ చేసే అధికారిక గుర్తింపు కార్డు

ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే..
పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు జాబితాలో మీ పేరు తప్పనిసరిగా నమోదయి ఉంటేనే ఓటు వేయగలుగుతారు. దీనికోసం మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో ముందే తెలుసుకొని ఉండాలి. ఓటరు స్లిప్పులో ఈ వివరాలన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు ఓటర్ స్లిప్పు అందకపోతే.. అందుబాటులో ఉన్న ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లేదా సి విజిల్ యాప్ లో ఈ వివరాలు ఉంటాయి.

వీటికి అనుమతి లేదు..
ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు బూత్ లోపలికి సెల్ఫోన్లు, కెమెరాలు, ల్యాప్టాప్ లు తీసుకెళ్లడం అనుమతి లేదు. పోలింగ్ బూత్ లోపల సెల్ఫీ దిగే ప్రయత్నం చేయడం నిషేధం. ఇలా చేస్తే అరెస్ట్ కూడా చేస్తారు.  మీరు వేసిన ఓటు కూడా లెక్కించరు. పోలింగ్ కేంద్రం దగ్గర పార్టీల గుర్తులు, పార్టీల రంగులు కలిగిన దుస్తులను సూచించే రంగు టోపీలను ధరించడం నిషేధం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios