Asianet News TeluguAsianet News Telugu

KA Paul: తెలంగాణలో 79 సీట్లు గెలిచేవాళ్లం.. ఏపీలో 175 గెలుస్తాం: కేఏ పాల్

కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి తానే కారణం అని అన్నారు. 79 స్థానాల్లో తమ పార్టీ ముందు ఉన్నదని తెలుసుకుని పోటీ నుంచి తమను దూరం చేశారని ఆరోపించారు.
 

due to my support congress came to power in telangana says praja shanti party chief ka paul kms
Author
First Published Dec 9, 2023, 3:03 AM IST

KA Paul: ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మరో సారి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తానే కారణం అని చెప్పారు. తాను కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చానని వివరించారు. కాంగ్రెస్‌కు 60 నుంచి 68 వరకు సీట్లు వస్తాయని తాను ముందే చెప్పినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో కుట్ర చేసి తమ పార్టీని ఇనాక్టివ్‌గా చూపించారని, తద్వార తమను పోటీకి దూరంగా నెట్టేశారని ఆరోపించారు. తెలంగాణ్ 79 స్థానాల్లో తామే ముందున్నామని తెలిసే వారు తమను పోటీలో నిలవడానికి అవకాశం ఇవ్వలేదని అన్నారు.

నామినేషన్ల గడువు ముగుస్తుండగా తమకు అనుమతి రావడంతో అప్పటికి అందుబాటులో ఉన్న ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారని, వారికి రింగ్ గుర్తు లభించిందని తెలిపారు. అందులో ఒక అభ్యర్థికి 2,800 ఓట్లు వచ్చాయని వివరించారు. తాము ఒక్క రోజూ ప్రచారం చేయకున్నా ఈ ఓట్లు పడ్డాయని చెప్పారు. నోటా కంటే పది రెట్లు అధికం అని తెలిపారు. ఇదీ తమ సత్తా అని, ఏపీలో పోటీ చేసినా తాము దుమ్ము రేపుతామని వివరించారు. 175కు 175 స్థానాలను ప్రజా శాంతి పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు.

Also Read: Telangana Assembly: హాస్పిటల్‌లో కేసీఆర్.. మరోవైపు BRSLP నేత ఎన్నిక.. గులాబీ ఎమ్మెల్యేల్లో ‘రివేంజ్‌’ ఆందోళన

ఇది తమకు సులువు అని కేఏ పాల్ వివరించారు. ఎందుకంటే ఒక పార్టీకి రెండు శాతం, మరో పార్టీకి ఐదు శాతం ఓటు శాతం ఉన్నాయని తెలిపారు. మనమంతా అనుకుంటే.. ప్రజా శాంతి పార్టీకి బంపర మెజార్టీ వస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. అన్న కాంగ్రెస్‌లో పార్టీని కలిపితే.. తమ్ముడు బీజేపీలో జనసేనను కలపాలని చూస్తున్నారని వివరించారు. టీడీపీ అవినీతి పార్టీ అని, జైలుకు వెళ్లాలనుకుంటే మాత్రమే ఆ పార్టీలో ఉండాని ఫైర్ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios