Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు మాయం: పాలకుర్తి సభలో కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  తెలంగాణ సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ మూడు లేదా నాలుగు సభల్లో ఆయన పాల్గొంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పై ఆయన విమర్శలు ఎక్కు పెడుతున్నారు.

Congress will scrap rythu bandhu scheme, if voted to power:says Kcr lns
Author
First Published Nov 14, 2023, 2:38 PM IST

పాలకుర్తి: తెలంగాణలో  కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు మాయమౌతుందని  సీఎం కేసీఆర్  చెప్పారు.మంగళవారంనాడు  పాలకుర్తిలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి  ప్రజా ఆశీర్వాద సభలో  తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  పాల్గొన్నారు. 

ఓటు వేసే ముందు  ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు. మంది మాటలు విని ఆగమైతే ఐదేళ్లు కష్టపడుతామన్నారు.స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా రావాల్సిన పరిణితి రాలేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.ఎన్నికలు రాగానే ఎందరో వస్తున్నారు... ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలన్నారు. నిజానిజాలు గమనించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. పార్టీల చరిత్ర, నడవడిక ఎలాంటిదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల బాగు కోసమే భారత రాష్ట్ర సమితి పుట్టిందని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు  ఇప్పుడు పాలకుర్తి ఎలా ఉందో ఆలోచించాలని ఆయన  కోరారు.పదేళ్ల క్రితం పాలకుర్తి నుండి వేల మంది ఉపాధి కోసం వలస పోయేవారు... ఇప్పుడు  పాలకుర్తికి వరినాట్లు వేసేందుకు వలస వస్తున్నారని కేసీఆర్ చెప్పారు. పాలకుర్తిలోని 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని కేసీఆర్ తెలిపారు.

రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. ఏం చేద్దామని కేసీఆర్ ప్రశ్నించారు.24 గంటల ఉచిత విద్యుత్ వద్దని. మూడు గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావించారు.నాయకలు మాటలు విని గోల్ మాల్ కావద్దని  కేసీఆర్ సూచించారు.50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలించిందన్నారు. మన బతుకులు మారాయా అని ఆయన ప్రశ్నించారు.

 

తెలంగాణలో 30 లక్షల వ్యవసాయ మోటార్లున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళఖాతంలో వేస్తారని చేస్తున్న వ్యాఖ్యలను  ఆయన గుర్తు చేశారు.ధరణిని ఎందుకు  పెట్టామో అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్  చెప్పారు.

also read:కాంగ్రెస్ నేతలే సంపన్నులు: వివేక్ టాప్, ఆ తర్వాతి స్థానాల్లో పొంగులేటి, కోమటిరెడ్డి

రైతులు బలపడేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన వివరించారు. పాలకుర్తి నియోజకవర్గంలో  వందల చెక్ డ్యామ్ లు నిర్మించినందుకు గాను  దయాకర్ రావుకు చెక్ డ్యామ్ ల రావుగా  నామకరణం చేసినట్టుగా  కేసీఆర్  చలోక్తి విసిరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios