Priyanaka Gandhi...ఎవరు ఏ ఆట ఆడినా తెలంగాణలో కాంగ్రెస్‌దే గెలుపు: ప్రియాంక గాంధీ
తెలంగాణలో రెండు రోజులుగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, పాలేరులలో రోడ్ షో నిర్వహించారు.మధిరలో జరిగిన సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
మధిర:ఎవరు ఏ ఆట ఆడినా తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ చెప్పారు.శనివారంనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
నిన్న రాత్రి తాను తన తల్లి సోనియాగాంధీతో ఫోన్ లో మాట్లాడిన విషయాలను ప్రియాంక గాంధీ సభలో వివరించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గానికి వచ్చినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.తెలంగాణకు వెళ్లావు, ఏం సందేశం ఇస్తావని తన తల్లి సోనియా గాంధీ తనను అడిగిందన్నారు. అయితే తాను సత్యం మాత్రమే చెబుతానన్నారు. రైతుల సమస్యల గురించి మాట్లాడుతానని తాను సోనియాగాంధీ చెప్పినట్టుగా ప్రియాంక గాంధీ వివరించారు.
తెలంగాణ కోసం ప్రజలు ఎంతగా పోరాడారో తనకు తెలుసునని సోనియాగాంధీ తన దృష్టికి తెచ్చారని ప్రియాంక గాంధీ చెప్పారు.ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని సోనియా చెప్పారు.బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేవన్నారు.తెలంగాణ సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.
రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు.రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఆలోచిస్తుందని ప్రియాంక గాంధీ చెప్పారు. ప్రశ్నా పత్రాల లీకేజీతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని ఆమె ప్రశ్నించారు. పేపర్ల లీకులతో తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆందోలన చెందుతున్నారన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవని ప్రియాంక గాంధీ చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగు పడ్డారని ప్రియాంక గాంధీ విమర్శించారు.
పెరిగిన నిత్యావసర ధరలతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల బాధలను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.తెలంగాణ సంపదను పంచుకోవడంలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారని ప్రియాంక గాంధీ విమర్శించారు.
దేశంలో ప్రజలే నాయకులన్నారు. ప్రజల కంటే అతీతులు అన్నట్టుగా మోడీ, కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు.కేసీఆర్ ఆలోచన,బుద్ది బాగా లేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. కేసీఆర్ బుద్ది ఏమిటో తెలుసా అని ఆమె ప్రశ్నించారు.
తన సోదరుడి మాదిరిగానే భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్ర నిర్వహించిన భట్టి విక్రమార్కను అభినందిస్తున్నట్టుగా ప్రియాంక గాంధీ చెప్పారు.ప్రజలు సత్యాన్ని ఎప్పుడూ గుర్తిస్తారని ఇందిరా గాంధీ చెప్పేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ కు అధికారంలో ఉండాలనేది కోరిక అని ఆమె చెప్పారు. తన కుటుంబం కోసం అధికారంలో ఉండడంతో పాటు సంపదను పోగేసుకోవడమే కేసీఆర్ లక్ష్యమని ప్రియాంక గాంధీ విమర్శించారు.
ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ కు మద్దతిస్తుందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కు బీజేపీకి మద్దతిస్తుందని ప్రియాంక ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ఎంఐఎం కూడ మద్దతిస్తుందని ప్రియాంక చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పది , పదిహేను సీట్లలో పోటీ చేసే ఎంఐఎం తెలంగాణలో ఏడు స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తుందని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు తన సోదరుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని ప్రియాంక గాంధీ చెప్పారు. మీ అందరితో కేసీఆర్ ఆటలాడుతున్నారన్నారు. అదే విధంగా బీజేపీ ఆటలను కూడ అర్ధం చేసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.
also read:Revanth Reddy... బీజేపీ, బీఆర్ఎస్ తో పోటీ కాదు ..ఈడీ ,ఐటీ తోనే:రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ నేతలకు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లున్నాయన్నారు. ఫామ్ హౌస్ ల నుండి బీఆర్ఎస్ నేతలు బయటకు రావడం లేదన్నారు.బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. మధిరలో కాంగ్రెస్ ఎన్నికల సభలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ కోసం సాగిన పోరాటాన్ని సోనియా గాంధీ తనకు గుర్తు చేశారన్నారు. కేసీఆర్ సర్కార్ తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రియాంక గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.